Niti Taylor: విడాకులు తీసుకోబోతున్న తనిష్ హీరోయిన్.?
Niti Taylor: ఒకప్పుడు ఇండస్ట్రీలో తన అంద చందాలతో ఊపు ఊపింది ఈ హీరోయిన్. మేము వయసుకు వచ్చాం అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే నీతి టేలర్.. త్రినాథరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఆమెకు మంచి గుర్తింపు ఇవ్వడంతో ఆ తర్వాత వరుసగా పెళ్లి పుస్తకం, లవ్ డాట్ కామ్ వంటి సినిమాల్లో చేసింది.
Niti Taylor who is going to divorce
అలా స్పీడ్ గా వచ్చి ఆఫర్లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ అంతే స్పీడ్ గా తెలుగు ఇండస్ట్రీని వదిలి బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అక్కడ “కైసి యే యారియాన్” అనే వెబ్ సిరీస్ చేసి క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా పలు పోస్టర్లు పెట్టి మంచి గుర్తింపుతో దూసుకుపోతోంది. ఇకపోతే 2020లో పరీక్షిత్ బావా అనే ఆర్మీ ఆఫీసర్ ను పెళ్లి చేసుకుంది. (Niti Taylor)
Also Read: Samantha: ఆ నిర్మాత సమంతకి 25 లక్షల తో పాటు ఫ్లాట్ కూడా.. అందరూ అనుకుంది నిజమైందిగా.?
కరోనా టైంలో వీరి పెళ్లి కావడంతో ఎవరికి ఎక్కువ తెలియలేదు. అప్పటినుంచి ఎంతో హ్యాపీగా కాపురం చేసుకున్నటువంటి వీరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్టు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా సోషల్ మీడియాలో విడాకుల వార్త వచ్చిన తరుణంలోనే టేలర్ తన పేరులోంచి భవ అనే పేరును తొలగించి నీతి టేలర్ అని మళ్లీ ఇన్స్టాగ్రామ్ పేరును పెట్టుకుంది. అంతేకాదు వారిద్దరు కలిసి ఉన్నటువంటి కొన్ని ఫోటోలు కూడా డిలీట్ చేసినట్టు తెలుస్తోంది.
దీంతో విడాకుల వార్తకు కాస్త ఊతం పోసినట్టు అనిపించింది. ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకునే ముందు వారికి సంబంధించినటువంటి ఇంస్టాగ్రామ్ ఖాతాలో మార్పులు చేసుకుంటున్నారు. ఆ తర్వాత విడాకుల బాటపడుతున్నారు. అదే తోవలో నీతి టేలర్ కూడా వస్తున్నడంతో, కొంతమంది సోషల్ మీడియాలో వార్తలు క్రియేట్ చేస్తున్నారు. దీనిపై నీతి టేలర్ స్వయంగా స్పందించి చెప్తే గాని ఈ వార్తలకు తెరపడదు.(Niti Taylor)