Sneha Reddy: పుష్ప-2 సినిమా చూసి మాడిపోయిన స్నేహ రెడ్డి మొహం..ఇంట్లో గొడవ..?
Sneha Reddy: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఊపు ఊపుతున్న సినిమా ఏంటయ్యా అంటే అందరికీ గుర్తుకు వచ్చేది పుష్ప2. తాజాగా రిలీజ్ అయినటువంటి ఈ చిత్రం రెండు రోజుల్లోనే రికార్డు స్థాయిలో వసూళ్లు చేస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో సుకుమార్ పేరు కూడా ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ విధంగా సినిమా ఉన్న నిడివిలో ఎక్కడ కూడా బోర్ అనిపించకుండా ప్రేక్షకులని కళ్ళు తిప్పుకోకుండా, చూసే విధంగా సినిమా తెరకెక్కించారని చెప్పవచ్చు.
Sneha Reddy face changed after seeing the movie Pushpa-2
అలాంటి పుష్ప2 చిత్రంలో అల్లు అర్జున్ రష్మిక మందాన నటన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఇక ఈ పాత్రలో వీరు తప్ప ఎవరూ చేయలేరు అనే విధంగా అనిపిస్తుంది.. వీరిద్దరూ పాత్రల్లో లీనమైపోయి నటించడమే కాదు రొమాన్స్ సన్నివేశాల్లో అచ్చం భార్యాభర్తల కంటే ఎక్కువగా చేశారు.. తాజాగా సంధ్య థియేటర్ లో వీళ్లు పుష్ప2 సినిమా చూడడానికి హాజరయ్యారు. అల్లు అర్జున్ దంపతులతో పాటు ఈ సినిమా చూడడానికి రష్మిక మందన్న కూడా వచ్చింది. (Sneha Reddy)
Also Read: Niti Taylor: విడాకులు తీసుకోబోతున్న తనిష్ హీరోయిన్.?
దీంతో నేటిజన్స్ వాళ్ళ ఫ్యామిలీ సినిమా చూడడానికి వస్తే ఈమెందుకు పానకంలో పుడక అంటూ ట్రోల్ చేస్తూ వస్తున్నారు.. ఈ సినిమా నడుస్తున్న సమయంలో కొన్ని రొమాంటిక్ సీన్స్ వస్తున్నప్పుడు కొంతమంది అభిమానులు సంబరాన్ని ఆపుకోలేక బన్నీకి పర్ఫెక్ట్ ఫెయిర్ రష్మిక, స్నేహ రెడ్డి కాదంటూ గట్టిగా అరిచారు. దీంతో స్నేహారెడ్డి ముఖం మాడిపోయినట్టు అయిపోయిందట. అయినా ఇదేది బయటకు కనిపించకుండా స్నేహ రెడ్డి చాలా హుందాగా బిహేవ్ చేసింది..
అంటే రష్మిక బన్నీ పర్ఫామెన్స్ అంతా బాగుంది కాబట్టే జనాలు ఆ విధంగా పొగుడుతున్నారంటూ ఆమె సైలెంట్ అయిపోయిందట.. ఏది ఏమైనా సొంత భర్తను వేరే అమ్మాయితో జత కడితే ఎవరికైనా లోలోపల కాలిపోతుంది.. కానీ స్నేహ రెడ్డి మాత్రం అలాంటిదేమీ బయట కనిపించకుండా కవర్ చేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా పుష్ప2 సినిమా మాత్రం ఇండస్ట్రీలోనే అద్భుతమైన హిట్టు దిశగా దూసుకుపోతుందని చెప్పవచ్చు.(Sneha Reddy)