Shakti Movie: ఎన్టీఆర్ శక్తి మూవీ డిజాస్టర్ కి కారణం రామ్ చరణేనా.. రైటర్ సంచలనం.?

Shakti Movie: ఎన్టీఆర్ సినీ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు అంటే ఎన్నో సినిమాల పేర్లు తెరమీద వినిపిస్తాయి.కానీ డిజాస్టర్ అయిన సినిమాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది శక్తి మూవీ మాత్రమే. అశ్వినీ దత్ నిర్మాతగా మెహర్ రమేష్ డైరెక్షన్లో వచ్చిన శక్తి మూవీ డిజాస్టర్ అవ్వడంతో ఈ సినిమా నష్టాలు పూడ్చలేక అశ్వినీ దత్ ఏకంగా ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవాలి అనుకున్నారట.
Is Ram Charan the reason for NTR Shakti Movie disaster
అంతలా ఈ సినిమా నష్టాలను మిగిల్చిందట. అంతేకాదు ఈ సినిమా వల్ల చాలా రోజులు ఇండస్ట్రీలో తలెత్తుకోకుండా అయ్యానని,అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి ఎన్నో ఇబ్బందులు పెట్టారంటూ కూడా అశ్వినీ దత్ చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఉంది అంటూ తాజాగా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని విమర్శిస్తున్నారు. (Shakti Movie)
Also Read: Chiranjeevi: అప్పటి హాట్ బ్యూటీ తో రామ్ చరణ్ పెళ్లి చేయాలనుకున్న చిరంజీవి.. కానీ.?
ఇక అసలు విషయంలోకి వెళ్తే..టాలీవుడ్ ఇండస్ట్రీలో రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్న తోట ప్రసాద్ పలు ఇంటర్వ్యూలలో సినిమాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయట పెడుతున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ నటించిన శక్తి మూవీకి సంబంధించి ఓ షాకింగ్ విషయం చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మగధీర సినిమాను చూసి అశ్వినీ దత్ ఎన్టీఆర్ తో శక్తి సినిమా చేశారు.

కానీ సినిమా కథలో కొన్ని చేంజెస్ రావడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారి డిజాస్టర్ అయింది.అలా రామ్ చరణ్ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని శక్తి మూవీని ఎన్టీఆర్ తో తీస్తే ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉందో చెప్పనక్కర్లేదు అంటూ తోట ప్రసాద్ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోని చూసిన చాలా మంది మెగా ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని ట్రోల్ చేస్తూ పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.(Shakti Movie)