Sobhita Dhulipala: పెళ్లిలో కాస్ట్లీ చీర కట్టిన శోభిత.. అక్కినేని కోడలు అనిపించుకుందిగా.?
Sobhita Dhulipala: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల ల పెళ్లి ఫోటోలే కనిపిస్తున్నాయి. డిసెంబర్ 4 రాత్రి 8 గంటలకు పెళ్లి చేసుకున్న ఈ జంట అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వర్ రావు విగ్రహం ఎదుట పెళ్లి అయిన సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే అక్కినేని నాగచైతన్య అక్కినేని ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలతో పాటు దగ్గుబాటి ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలు కూడా నెట్టింట హైలెట్ గా మారాయి.
Sobhita Dhulipala who wore a costly saree at the wedding
అంతేకాకుండా నాగచైతన్య తల్లి ఇద్దరు మేనమామలు అయినటువంటి వెంకటేష్, సురేష్ బాబులతో పాటు రానా దగ్గుబాటితో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక వీరి పెళ్లి జరిగిన తర్వాత నాగార్జున ఎమోషనల్ పోస్టు కూడా చేశారు. అంతేకాకుండా పెళ్లయిన వెంటనే శ్రీశైలంకి వెళ్లి కొడుకు కోడలు తో నాగార్జున దర్శనం చేసుకున్నారు. (Sobhita Dhulipala)
Also Read: Niti Taylor: విడాకులు తీసుకోబోతున్న తనిష్ హీరోయిన్.?
దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే పెళ్లిలో శోభిత ధూళిపాళ్ల రెండు కాస్ట్లీ చీరలను కట్టుకుంది. ఒక చీర బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉంటే మరో చీర తెలుపు రంగులో ఉంది. ఇక బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆ చీర ధర ఏకంగా 3 లక్షలని సమాచారం..
అంతేకాదు ఆ చీరకి సెట్ అయ్యే విధంగా ఏడు వారాల నగలను కూడా ధరించింది. అలాగే తర్వాత కట్టుకున్న తెల్లచీర ధర కేవలం 10,000 మాత్రమేనని తెలుస్తోంది. అలా తన పెళ్లి చీర మూడు లక్షలు అంటే మామూలు విషయం కాదు.ఎంతైనా అక్కినేని ఫ్యామిలీకి సెట్ అవ్వాలంటే ఆ రేంజ్ లో ఖర్చు పెట్టాల్సిందే.(Sobhita Dhulipala)