Chips: ప్రస్తుత కాలంలో చాలావరకు కాకరకాయ, బెండకాయ, బీట్రూట్, క్యారెట్ ఇతర కూరగాయాలని డీహైడ్రేటెడ్ గా తయారుచేసి మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు. కూరగాయలలో ఉండే తేమశాతాన్ని తొలగించి క్రిస్పీగా తయారు చేస్తున్నారు. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు తొలగిపోకుండా ఉంటాయి. కృత్రిమ ప్రిజర్వేటివ్స్ తో పనిలేదు కాబట్టి ఇవి ఆరోగ్యానికి మంచిదే. Chips

Health Issues With Chips

అయితే కొనే ముందు వీటిని కాస్త పరిశీలించి తీసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. ఇందులో కూరగాయలు పాడవకుండా ఉప్పును ఎక్కువగా వాడతారు. అంతేకాకుండా కృత్రిమ రంగులు, రుచిని పెంచడానికి సీజనింగ్స్ వంటివి వాడతారు. అందువల్ల వీటిని కొనే ముందు కాస్త ఆలోచించి, పరిశీలించి తీసుకోవాలి. వెజిటబుల్ చిప్స్ తో పోల్చితే పచ్చి కూరగాయలలోనే పోషకాలు, విటమిన్స్ అధికంగా ఉంటాయి. Chips

Also Read: KTR: త్వరలోనే జైలుకు పొంగులేటి… బాంబు పేల్చిన కేటీఆర్ ?

వెజిటబుల్ స్నాక్స్ సమయంలో తినడం మంచిదే. డీహైడ్రేటెడ్ వెజిటబుల్ చిప్స్ ని పరిమిత మోతాదులో తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలా కాదని డిహైడ్రేటెడ్ వెజిటబుల్ చిప్స్ ని అధికంగా తీసుకుంటే సమస్యలు వస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ వీటిని కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అధిక మోతాదులో వీటిని తినడం మంచిది కాదని చెబుతున్నారు. దీనికి బదులు పచ్చి కూరగాయలను తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. Chips