Curd and Milk: పెరుగు పాలు రెండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండిట్లో కూడా పోషకాలు ఉంటాయి. పెరుగులో ప్రోబయోటిక్స్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.అయితే కొందరు పిల్లలు పాలు తాగితే పెరుగు తినరు. అలాగే పెరుగు తింటే పాలు తాగరు. దీంతో తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. అప్పుడప్పుడు పిల్లల ఆరోగ్యానికి ఏది మంచిది అని వారు ఆలోచిస్తూ ఉంటారు. పాలలో విటమిన్ బి2, బి 12, ఫాస్పరస్, కాలుష్యం, పొటాషియం, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పెరుగు వర్సెస్ పాలు ఈ రెండింటిలో పిల్లలకు ఏది బెస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం.
Health benefits of Curd and Milk for kids
పెరుగుతో ఆరోగ్య ప్రయోజనాలు..
పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగు హెల్తీ ఫుడ్ అంటారు. ఒంట్లో వేడి తగ్గాలంటే పెరుగును తినాలని మన పెద్ద వాళ్ళు చెబుతారు. పెరుగులో చాలా పోషకాలు ఉంటాయి. పెరుగులో విటమిన్ బి6, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, విటమిన్ సి, విటమిన్ ఎ ,కాలుష్యం, వంటి అనేక పోషకాలు ఉంటాయి. పెరుగులో మంచి బాక్టీరియా కూడా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. దీనివల్ల అజీర్తి సమస్యలు తగ్గుతుంది. పెరుగులో ఫాస్ఫరస్, కాలుష్యం ఎక్కువగా ఉంటుంది పిల్లలలో దంతాలు ఎముకలు చాలా స్ట్రాంగ్ అవుతాయి. అలాగే పెరుగు మీ గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. పెరుగు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.
Also Read: Krish to Marry: హైదరాబాదీ డాక్టర్ ను రెండో పెళ్లి చేసుకోబోతున్న దర్శకుడు క్రిష్!!
పాలతో ఆరోగ్య ప్రయోజనాలు..
పాలు సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో మంచిది. పాలు పిల్లల ఆరోగ్యానికి పౌష్టికాహారం కూడా అంటారు. పాలలో విటమిన్లు, కాలుష్యం, ప్రోటీన్లు వంటి పోషకాలు ఉంటాయి. వీటితో పిల్లల ఎముకలు ఆరోగ్యంగా మారుతాయి. పిల్లల ఎముకలు దృఢంగా ఉంటాయి. ఎదిగే పిల్లలు పాలు తాగితే మంచిది. పాలు తాగడం వల్ల పిల్లలు ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. పాలు పిల్లల మానసిక ఆరోగ్యాన్ని తోడ్పడుతుంది. పాల లో విటమిన్ డి ఉంటుంది. ఇది శరీరానికి చాలా అవసరం పిల్లల దంతాల ఆరోగ్యానికి చాలా మంచిది.
పిల్లల ఆరోగ్యానికి ఏది మంచిది..
పాలతో పోలిస్తే పెరుగు జీర్ణ క్రియ కు మంచి ప్రోబయోటిక్ ఆహారం. పాలను అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ కు సంబంధించిన సమస్యలు వస్తాయి. పెరుగు జీర్ణ క్రియను మెరుగుపర ఆచడం సహాయపడుతుంది. దీనితో పాటు చిన్నపిల్లలకు కడుపులో ఇన్ఫెక్షన్ తొలగించడంలో కూడా సహాయపడుతుంది .ఇందులో ఉండే విటమిన్ సి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. పిల్లలు పెరుగు క్రమం తప్పకుండా తింటే సీజనల్ వ్యాధులు జలుబు వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.