Married Woman: పెళ్లి పురుషుడితో పోలిస్తే మహిళలకు భిన్నంగా ఉంటుంది. మహిళా చిన్నప్పటి నుంచి పెరిగిన కుటుంబాన్ని వాతావరణన్ని వదిలి అత్తారింటికి వస్తుంది. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కీలకమైన ఘట్టం. ఇద్దరు వ్యక్తుల్ని జీవితంలో కలిపి ఉంచేది పెళ్లి. ఇలాంటి పవిత్ర బంధాన్ని నిలుపుకోవడం ఎంతో కీలకం. వివాహం అయినా కొత్తలో భార్య భర్తలు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా, ప్రేమగా ఉంటారు.
అయితే రాను రాను పరిస్థితులు మారిపోతుంటాయి. ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు కూడా వాళ్లకి పెద్దవిగా కనిపిస్తాయి. కాలం గడిచే కొద్ది ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు కూడా వస్తాయి. చిన్న చిన్న గొడవలు కూడా పెద్ద సమస్యలుగా చూడకూడదు. గొడవల్ని ఎంతో ఓపికతో, నేర్పుతో పరిష్కరించుకోవాలి. అప్పుడే వివాహ బంధం కలకాలం బలంగా ఉంటుంది. లేదంటే చివరకు ఆ బంధం విడాకులకు దారితీస్తుంది. వివాహ బంధంలో ఎటువంటి కలహాలు రాకుండా జీవితం సాఫీగా సాగిపోవాలంటే పెళ్లైన స్త్రీలు ఈ తప్పులు చేయకూడదు అవేంటో ఇప్పుడు చూద్దాం.
Things a married women should never do
వివాహం తర్వాత మహిళలు తమను తాము చాలా నిర్లక్ష్యం చేసుకుంటారు. అత్తగారిల్లు, భర్త, పిల్లలు ఇలా కుటుంబ బాధ్యతలు ఎక్కువగా శ్రద్ధ చూపుతారు. కుటుంబ పనులతో తీరిక లేకుండా గడుపుతారు. అత్త మామ, భర్త మెప్పు కోసం తన లక్ష్యాలను, కోరికలను కూడా పక్కన పెట్టేస్తారు. ఇలాంటి తప్పు అసలు చేయకూడదు. భవిష్యత్తులో అత్తమామతో కానీ లేదంటే భర్తతో గాని గొడవలు అయితే అప్పుడు పరిస్థితిని ఒక్కసారి ఆలోచించుకోవాలి. అప్పుడు బాధపడిన ఏం ప్రయోజనం ఉండదు. కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మీ లక్ష్యాలను మీ కోరికలపై కూడా శ్రద్ధ పెట్టండి. కెరీర్ కుటుంబాన్ని రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటేనే మీరు ఉన్నత స్థాయిలో ఉండగలరు.
Also Read: Varun Tej Horror Comedy: సాయి ధరమ్ తేజ్ బాటలో వరుణ్ తేజ్.. హిట్ అందుకునేనా?
భార్య అవసరాన్ని తీర్చడం ప్రతి ఒక్క భర్త బాధ్యత అని అందరికీ తెలుసు. అయితే కోరికలు హద్దులు దాటకుండా ఉండాలి. మీ అవసరాన్ని భర్త తీరుస్తాడు అని అనుకుంటే అది పెద్ద పొరపాటు అవుతుంది. ప్రతి అవసరం భర్త నెరవేరుస్తాడని అనుకోవడం అది ఒక పెద్ద తప్పు. ఆ కోరికలు నెరవేరకపోతే మీరు చాలా నిరాశపడతారు. ఆ తర్వాత భర్తని నిందించడం సర్వసాధారణంగా మారిపోతాయి. ఇలాంటి తప్పులు మీరు చేస్తుంటే వెంటనే వాటిని కరెక్ట్ చేసుకోండి. పిల్లలకు కుటుంబానికి ఎలా సమయం కేటాయించారో అలాగే భర్తకు కూడా టైం కేటాయించాలి. ఇంటి పనుల్లో అలసిపోతున్నారని భర్త ఇష్టాలకు సమయం కేటాయించకపోతే అది మీకే నష్టం భర్త పైన అన్ని భారాలు మోపకూడదు. వారికి తగ్గ సమయం కేటాయించాలి. మీ మధ్య వచ్చే సమస్యలను పరిష్కరించుకోవాలి. మీరు సమయం కేటాయించకపోతే భర్త తీవ్ర అసహానికి గురయ్య ప్రమాదం ఉంటుంది. అందుకే మీరు ఇలాంటి తప్పులు చేయకండి ఇలాంటి తప్పులు చేస్తే సరి చేసుకోండి
వివాహ బంధంలో శారీరక సన్నిహితం కూడా చాలా కీలకము. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మానసికంగా మీరు చాలా ఆనందంగా ఉన్న శారీరకంగా ఇబ్బందులు ఉంటే ఈ వివాహ బంధంలో కల్లోలం తప్పదు. తమను పట్టించుకోవడం లేదు. వర్క్ పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారని కొందరు మహిళలు శారీరక సన్నిహితానికి దూరంగా ఉంటారు. దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి శారీరక కలయిక కూడా చాలా కీలకము అది లేకపోతే దంపతుల మధ్య దూరం పెరుగుతుంది దీంతో పురుషులు ఇతర స్త్రీలను ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇలాంటి తప్పులు చేయకూడదు ఇలాంటి తప్పులు చేస్తే సరి చేసుకోండి.