Foods to avoid with cold and cough

Cold And Cough: అసలే చలికాలం వచ్చేసింది జలుబు, దగ్గు ఉన్నవారు వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు..చలికాలం స్టార్ట్ అయింది. చలికాలం వచ్చిందంటే చాలామంది జలుబు, దగ్గు బారిన పడుతుంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ సమస్యతో బాధపడతారు. జలుబు, దగ్గు వచ్చాయంటే తొందరగా తగ్గవు. ఎన్ని మందులు వాడినా ఇంటి చిట్కాలు ప్రయత్నించిన కూడా దగ్గు, జలుబు వదిలించుకోవడం చాలా కష్టం అందుకే చలికాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓసారి దగ్గు మొదలైతే ఊపిరాడదు. దగ్గి దగ్గి ప్రాణం పోవాల్సిందే అందుకే దగ్గు, జలుబు ఉన్నవారు కొన్ని పదార్థాల జోలికి వెళ్లకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Foods to avoid with cold and cough

సాధారణంగా కాఫీలో “కెఫిన్” అనే పదార్థం ఉంటుంది. ఇది గొంతులోని కండరాల్ని పొడి బారేల చేస్తుంది. దగ్గు జలుబుతో బాధపడేవారు కాఫీ టీ ని తాగకుండా ఉండడమే మంచిది. కాఫీ తాగడం వల్ల గొంతు ఇంకా పొడి భారీ దగ్గు తీవ్రత పెరిగే ప్రమాదముంది. అంతేకాకుండా గొంతు నొప్పి కూడా రావచ్చు. కాఫీతో పాటు టీ కి కూడా చాలా దూరంగా ఉండడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. చలికాలంలో దగ్గు, జలుబు ఉన్నవారు ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్ జోలికి అసలు పోకూడదు. ఈ సమస్యలు ఉన్నవారు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే గొంతు నొప్పితో పాటు దగ్గు తీవ్రత కూడా పెరిగే ప్రమాదం ఉంది.

Also Read: Jithender Reddy : నక్సల్స్ అన్యాయాలను ప్రశ్నించే “జితేందర్ రెడ్డి”… మూవీ రివ్యూ & రేటింగ్!!

ఈరోజులో చాలా మంది రిఫ్రిజిరేటర్ లో పెట్టిన పండ్లు, ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. ఇలా చేయడం కరెక్ట్ కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జలుబు, దగ్గు సమస్యతో బాధపడేవారు చల్లటి ఆహార పదార్థాలు తింటే వారికి గొంతు నొప్పి ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. అంతే కాకుండా కొందరిలో దగ్గు తీవ్రత కూడా పెరిగే ముప్పు ఉందని అంటున్నారు. అందుకే ఈ సీజన్ లో చల్లని ఆహారాలకు దూరంగా ఉండాలి. వేడివేడి ఏదైనా సూపులు లేదా హెర్బల్ టీలు తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

సీతాఫలంలో కూడా ఎక్కువ పోషకాలు ఉంటాయి. చలికాలం ప్రారంభంలో సీతాఫలాలు ఎక్కువగా మార్కెట్లలో కనిపిస్తాయి. సాధారణ వ్యక్తులు వీటిని తింటే చాలా మంచిది. కానీ దగ్గు, జలుబు సమస్య ఉన్నవారు ఈ పండుకి దూరంగా ఉండాలి. సీతాఫలం తింటే జలుబు తీవ్రత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే జలుబు దగ్గు సమస్యతో బాధపడేవారు వీటిని ఎక్కువగా తినకూడదు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

పైనాపిల్ లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ మాంగనీస్, ఐరన్ వంటి ఖనిజాలు మినరల్స్ ఉంటాయి. పైనాపిల్ ను పోషక నిలయం అని కూడా అంటారు.అయితే జలుబు, దగ్గు ఉన్నవారు దీన్ని తినకూడదు. దీనిని తింటే సమస్య ఇంకా తీవ్రతమయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. పైనాపిల్ వల్ల దగ్గు జలుబు ఉన్న వారిలో మరింత అలర్జీ పెరిగే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.
బత్తాయి, నిమ్మ, గ్రేప్ ఫ్రూట్, నారింజ పండ్లు, సిట్రస్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఎలాంటి సమస్యలు లేనివారు వీటిని తింటే మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అయితే ఇప్పటికే జలుబు, దగ్గు సమస్యతో బాధపడేవారు మాత్రం వీటిని తినకూడదు అంటున్నారు. వీటిని తింటే దగ్గు, జలుబు ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుందంటున్నారు. చలికాలంలో దగ్గు, జలుబు సమస్యతో బాధపడేవారు వీటిని తినకూడదు.