Thaman: ఈ మధ్యకాలంలో ఏ ఇండస్ట్రీలో చూసినా పాన్ ఇండియా స్థాయిలో చిత్రాలు తీస్తున్నారు. అంతేకాదు సినిమాలను పార్ట్ లు పార్ట్ లుగా విభజిస్తూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బాహుబలి1, బాహుబలి 2. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.. ఆ తర్వాత వచ్చిన మరో పాన్ ఇండియా చిత్రం పుష్ప. గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ సాధించింది.. అయితే ఈ మూవీ సక్సెస్ తర్వాత పుష్ప-2 చిత్రం తెరకెక్కుతోంది..
Thaman who made sensational comments
అయితే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినటువంటి టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే పుష్ప సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చింది దేవిశ్రీప్రసాద్.. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అయినా కానీ కాస్త బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో డల్ అయిపోయిందని అప్పట్లో కొన్ని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే పుష్ప2కు థమన్ ను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది..(Thaman)
Also Read: Vaishnav Tej: శ్రీలీల కాదు.. ఆ హీరోయిన్ తో వైష్ణవ్ తేజ్ పెళ్లి..?
ఇక ఈయనే కాకుండా అజనీష్ లోక్నాథ్, సామ్ సీ ఎస్ కూడా ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్లు గా చేసే అవకాశం ఉంది.. ఇలా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కాస్త సందిగ్ధం నెలకొన్న తరుణంలో అప్పట్లో థమన్ మాట్లాడినటువంటి మాటలు కొన్ని వైరల్ అవుతున్నాయి. “ప్రస్తుత కాలంలో చాలా మంది డైరెక్టర్లు నిర్మాతలు సినిమాలను రెండు మూడు భాగాలుగా చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో ఒక పార్ట్ ఒకరితో మరో పార్టీ ఇంకొకరితో సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయిస్తున్నారు. ఇది నాకు ఏ మాత్రం నచ్చలేదని అన్నారు..
ఇలా సినిమాలను పార్ట్ లుగా విడదీసి మ్యూజిక్ డైరెక్టర్లను మార్చడం చూస్తే పెళ్లి ఒకరితో శోభనం మరొకరితో చేయించినట్లుగా ఉంటుంది అంటూ సెటైరికల్ కామెంట్లు వేశారు.. అంతేకాకుండా ఒక్కోసారి ఒక్కో సినిమాకు ముగ్గురు నుంచి నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లను కూడా ఉంటున్నారు. వారంతా ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదని చెప్పారు”. ప్రస్తుతం పుష్ప ఫస్ట్ పార్ట్ కు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్, సెకండ్ పార్ట్ కు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా రాబోతున్నట్టు వార్తలు వస్తుండడంతో ఆయనే పెళ్ళి ఒకరితో శోభనం మరొకరితో అని కామెంట్ చేశారు.మరి ఈ సినిమాకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా ఎలా చేస్తారు అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..(Thaman)