Nita Ambani Luxurious Watch Collection

Nita Ambani Luxurious Watch: భారతదేశంలోని అత్యంత ధనవంతమైన కుటుంబాలలో అంబానీ కుటుంబం ఒకటి, ఈ కుటుంబానికి చెందిన నీతా అంబానీ తన అద్భుతమైన ఫ్యాషన్‌ అభిరుచితో ఫేమస్ అయ్యారు. ఆమె ధరించే దుస్తులు, ఆభరణాలు ప్రజల దృష్టిని కట్టిపడేస్తాయి. ఆమె కలెక్షన్‌లో ఉన్న ఖరీదైన వాచీల వివరాలు ఆమె లక్జరీ జీవనశైలికి నిదర్శనంగా నిలుస్తాయి. ప్రత్యేకత కలిగిన ఇలాంటి వాచీలు, కేవలం సమయం చూపించే సాధనాలు మాత్రమే కాదు. అవి ఆమె అభిరుచిని, ఆలోచనలని తెలియజేస్తాయి.

Nita Ambani Luxurious Watch Collection

ఆమె తరచుగా ధరించే వాచీల్లో Jacob & Co Fleurs De Jardin Pink Sapphire వాచ్ ఒకటి. 18 క్యారెట్ల ప్యూర్ బంగారంతో తయారైన ఈ వాచ్ దాదాపు 3.9 కోట్ల విలువ చేస్తుంది. ఈ వాచ్‌ను ఆమె తన కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలో ధరించి మరింత ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ వాచ్ స్ట్రక్చర్ అది ధరించే వారిలోనే కాకుండా, చూసేవారిలోనూ పోసిటివిటీ ని కలుగజేస్తుంది.

Also Read: Tamarind Leaf Tea: చింతాకు టీతో తాగడం అలవాటు చేసుకోండి..100 రోగాలు ఖతం ?

అలాగే, Patek Philippe Nautilus వాచ్ కూడా నీతా అంబానీకి ఎంతో ఇష్టమైనది. 1976లో పరిచయమైన ఈ వాచ్ అప్పటినుండి లగ్జరీ స్పోర్ట్స్ వాచీలలో ప్రథమ స్థానంలో ఉంది. దాని విలువ దాదాపు 54 లక్షలు. Patek Philippe Aquanaut Luce Haute Joaillerie వాచ్ కూడా ఆమె కలెక్షన్‌లో ఒక భాగం, దాని విలువ 1.3 నుండి 1.6 కోట్ల మధ్య ఉంటుంది. ఈ వాచీలు నీతా అంబానీకి ప్రత్యేకమైన గౌరవాన్నే కాదు, ఖరీదైన అభిరుచిని కూడా ప్రతిబింబిస్తాయి.

Cartier Libre WD000002 వాచ్ కూడా ఆమె కలెక్షన్‌లో ప్రత్యేకతను చాటుతుంది. 18 క్యారెట్ల పింక్ గోల్డ్‌తో తయారైన ఈ వాచ్, దాదాపు 25 లక్షల రూపాయల విలువ అని అంటున్నారు. ఆమె కలెక్షన్‌లోని ప్రతి వాచ్ ఆమె వ్యక్తిత్వానికి , ప్రతీకగా నిలుస్తాయి. మొత్తం మీద, నీతా అంబానీ తన రిచ్ జీవనశైలితో ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తారు. ఆమె ధరించే ప్రతి వాచ్, ఆభరణం ప్రజలను ఆకర్షిస్తుంది. ఆమెకు ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ, ఆ వ్యక్తిత్వంలో ప్రత్యేకతను చాటుతుంది. నీతా అంబానీ తన అభిరుచిలోని ప్రత్యేకతతో అంబానీ కుటుంబానికి గౌరవాన్ని తెచ్చిపెడుతున్నారు.