Atibala: అతి బలకు సంబంధించి అద్భుతంగా పనిచేసే జ్యూస్, పౌడర్ రూపంలో మార్కెట్లో చాలా సులభంగా దొరుకుతాయి. అతిబల మొక్క ఉపయోగాలు, దానివల్ల ఎలాంటి వ్యాధులను నయం చేయవచ్చు అనేది చూద్దాం…. ఆయుర్వేదం ప్రకారం ఈ మొక్క, దాని పువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జలుబు, దగ్గు వంటి వ్యాధులను అతిబల మొక్క సులభంగా తగ్గిస్తుంది. దీనిని ముదురు బెండ చెట్టు అని కూడా పిలుస్తారు. Atibala
Health Benfits With Atibala
ఇది పల్లెటూర్లలో విరివిగా దొరుకుతుంది. దీని పూలు పసుపు పచ్చగా ఉంటాయి. ఆకులు ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. పేరులో ఉన్నట్టుగానే ఈ చెట్టు అధిక బలాన్ని ఇస్తుంది. దీని ఆకుల రసాన్ని వారానికి రెండు మూడు సార్లు తాగినట్లయితే నీరసం తగ్గి చాలా యాక్టివ్ గా తయారవుతారు. ఇది కంటి సమస్యలను తగ్గించడానికి సహాయం చేస్తుంది. ఈ తరుణంలోనే ముదురు ఆకులను నీటిలో మరిగించాలీ. ఆ నీటితో మూసిన కళ్ళను కడుగుతూ ఉంటే కంటి చూపు బాగుంటుందట.Atibala
Also Read: YCP: ఏపీ పోలీసులకు ఉరి వేయడం గ్యారంటీ.. వైసిపి స్ట్రాంగ్ వార్నింగ్?
కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధపడుతున్న వారు నాలుగు ముదురు బెండ ఆకులను తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి కషాయం రూపంలో తయారు చేసుకొని తాగాలి. దీనివల్ల కిడ్నీలో రాళ్లు సులభంగా కరిగిపోతాయి. ఇందులో కండ చక్కెర లేదా పటిక బెల్లం వేసుకొని తాగాలి. ఇన్ఫెక్షన్లు, జ్వరం, మూత్రం మంటను సులభంగా తగ్గిస్తుంది. కీళ్లు, మోకాళ్ళ నొప్పులకు అతిబల మొక్కను ఉపయోగించాలి. వారం రోజులపాటు దీనిని నొప్పులు ఉన్నచోట పేస్ట్ రూపంలో తయారు చేసి పెట్టినట్లయితే నొప్పులు వాపులు తగ్గుతాయి. Atibala