Sai Dharam Tej shared the video with the heroine saying 'Na papa'

Sai Dharam Tej: మెగా ఫ్యామిలీ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకొచ్చేది చిరంజీవి,పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నాగబాబు . ఆ తర్వాత వరుణ్ తేజ్,సాయి దుర్గ తేజ్ పేర్లు మాత్రమే. మెగాస్టార్ చిరంజీవి నట వారసులుగా ఇంత మంది ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇందులో మంచి గుర్తింపుతో దూసుకుపోతున్నటువంటి యంగ్ హీరో సాయి దుర్గ తేజ్. రేయ్ అనే మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన పిల్లా నువ్వు లేని జీవితం అనే చిత్రం ద్వారా మంచి గుర్తింపు సాధించారు.

Sai Dharam Tej shared the video with the heroine saying ‘Na papa’

ఈ మూవీ తర్వాత ఆయన వరుసగా తేజ్ ఐ లవ్ యు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,తిక్క, చిత్రలహరి, సుప్రీమ్,జవాన్ వంటి చిత్రాలు చేశారు. ఇందులో ఎక్కువ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. అలా కెరియర్ ఓ దారిలో ఉన్న సమయంలోనే యాక్సిడెంట్ అయ్యి తీవ్రంగా గాయాలై కొన్ని నెలలపాటు సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత విరూపాక్ష,బ్రో చిత్రంతో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అలా విరూపాక్ష మూవీ ద్వారా అద్భుతమైన హిట్ సాధించారు సాయిధరమ్ తేజ్.(Sai Dharam Tej)

Also Read: Pushpa 2: ట్రైలర్ తోనే భారీ అంచనాలు..పుష్ప 2 ట్రైలర్ రన్ టైం ఎంతంటే?

అలాంటి సాయి ధరంతేజ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఒక వీడియోను షేర్ చేసి ఎమోషనల్ అయ్యాడు. ఆయనకు ఎంతో గుర్తింపు ఇచ్చినటువంటి పిల్ల నువ్వు లేని జీవితం సినిమా నుంచి ఒక వీడియోను షేర్ నా జర్నీ ఇక్కడితో ప్రారంభమైందని గీత ఆర్ట్స్ బ్యానర్ వారికి డైరెక్టర్ అస్రవికుమార చౌదరికి సినిమా కోసం పని చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. నా పాప రెజినా కసాండ్రా కు థాంక్స్ అంటూ చెప్పారు.

Sai Dharam Tej shared the video with the heroine saying 'Na papa'

ప్రస్తుతంసాయి దుర్గా తేజ్ ఈ పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన వారంతా ఆయ పెళ్లి గురించే చెప్పాడని అనుకున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా ఈయన హీరోయిన్ రెజీనా తో లవ్ లో ఉన్నారని, ఆమెని త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే తరుణంలో ఆయన ఇలాంటి పోస్ట్ చేయడంతో ఇక పెళ్లి చేసుకుంటాడు కావచ్చు, ఆయన రెజీనా కసాండ్రాతో కమిట్ అవుతారా అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఎస్డిటి 18 సినిమాతో మన ముందుకు రాబోతున్నారు.(Sai Dharam Tej)