Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి గందరగోళం నెలకొంటోంది. భారత జట్టు పాకిస్తాన్ కు అస్సలు వెళ్ళేది లేదంటూ బీసీసీఐ అనౌన్స్ చేసింది. భారత వైఖరిపై అలిగిన పాకిస్తాన్ జట్టు రోజుకొక విధంగా పుకార్లను వ్యాప్తి చేస్తుందని వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ఐసీసీ పైన ఒత్తిడి తెస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఆసియా కప్ 2023లో జరిగినట్లుగానే టీం ఇండియా మ్యాచ్లు అన్నీ పాకిస్తాన్ వెలుపల నిర్వహించాలని బీసీసీఐ కోరడం జరుగుతోంది. Champions Trophy 2025

Pakistan rules out back channel diplomacy with India on Champions Trophy

పాకిస్తాన్ హైబ్రిడ్ మోడల్ లో టోర్నమెంట్ ను నిర్వహించాలనుకోవడం లేదు. మొత్తం టోర్నీని పాకిస్తాన్ లో ఆడకపోయినట్లయితే ఈ టోర్ని నుంచి పాకిస్తాన్ తన పేరును ఉపసంహరించుకోవచ్చని అంటే ఈ టోర్నీని బహిష్కరిస్తామని కొన్ని నివేదికలు వెల్లడించాయి. పాకిస్తాన్ హైబ్రిడ్ మోడల్ కు సిద్ధంగా లేనట్లయితే ఐసీసీ మొత్తం టోర్నమెంట్ ను వేరే దేశానికి మార్చాలని ప్రతిపాదించవచ్చు. ఇందులో UAE, దక్షిణాఫ్రికా, శ్రీలంక వంటి దేశాలు సైతం ఉన్నాయి. Champions Trophy 2025

Also Read: Raghurama Krishna Raju: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకు ఊహించని ఎదురు దెబ్బ ?

పాకిస్తాన్ వైదొలిగినట్లయితే, 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం ముందంజలో ఉందని ఇప్పుడు ఒక నివేదికలో పేర్కొన్నారు. అంటే ఈ టోర్నీని భారతదేశంలో కూడా నిర్వహించవచ్చు. ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముసాయిదా షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుంచి మొదలు కానుంది. కాగా, చివరి మ్యాచ్ మార్చి 9న నిర్వహించనున్నారు.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభంకి ఇంకా 100 రోజులు కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో, షెడ్యూల్ ను ప్రకటించే విధంగా ఐసీసీ వీలైనంత త్వరగా నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. Champions Trophy 2025