Jayam Ravi: ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీ వారు విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. చిన్న చిన్న విషయాలకే విడాకుల వరకు వెళుతూ సంచలనాలు సృష్టిస్తున్నారు. ఇదే కోవలోకి నటుడు రవి మోహన్ అలియాస్ జయం రవి వచ్చారు. ఆయన సినిమా కెరియర్ పరంగా ఎంతో దూసుకుపోతున్న తన సొంత లైఫ్ లో మాత్రం చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. తను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నటువంటి సతీమణి ఆర్తీకి విడాకులు ఇవ్వబోతున్నారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
A shock for Jayam Ravi He has to stay with his wife
అంతేకాదు వీరు విడాకుల కోసం కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో చెన్నై ఫ్యామిలీ కోర్టు తాజాగా పిటిషన్ పరిశీలించి జయం రవిని కోర్టుకు రావాలని కోరింది. దీంతో ఆయన కోర్టుకు వెళ్లగా ఆర్తి వీడియో కాల్ లో అందుబాటులోకి వచ్చి ఇరు వర్గాల వాదనలు విన్నది న్యాయస్థానం. దీంతో కోర్టు ఇద్దరూ కలిసి రాజీ కుదుర్చుకునే విధంగా ప్రయత్నాలు చేయాలని సూచనలు చేసింది. (Jayam Ravi)
Also Read: Allu Arjun: పరమ పిసినారి అంటూ తండ్రిని తిట్టిన అల్లు అర్జున్..?
ఆ తర్వాతే వీరిద్దరు విడిపోవాలని స్పష్టం చేసింది. ఇక జయం రవి ఆర్తి పెళ్లి విషయానికి వస్తే 2009లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఇక ఇన్ని సంవత్సరాల తర్వాత వీరి మధ్య ఏం పుట్టిందో ఏమో కానీ గత సెప్టెంబర్ లో మేము విడిపోతున్నామని జయం రవి స్వయంగా ప్రకటన చేశారు. అంతేకాదు ఇరు కుటుంబాల మధ్య చర్చలు చేసిన తర్వాతే మేము ఈ నిర్ణయం తీసుకున్నామని, మా ఇద్దరి బాగు కోసమే ఇలాంటి నిర్ణయానికి వచ్చామని అన్నారు.
నేను నా భార్య వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, మా వైవాహిక జీవితంలో ఎంతో బాధ అనుభవించానని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు జయం రవి సింగర్ తో రిలేషన్ విషయంపై కూడా స్పందించారు. నాకు ఎలాంటి రిలేషన్ లేదని అవన్నీ అవాస్తవాలని తెలియజేశారు. ఇలా ఇన్ని వాదనలు విన్నటువంటి కోర్టు మరోసారి రాజీకి ప్రయత్నించాలని ఒక ఛాన్స్ ఇచ్చింది.(Jayam Ravi)