Curd: చలికాలంలో పెరుగు తింటున్నారా..అయితే డేంజర్ లో పడ్డట్టే ?
Curd: చలికాలంలో బెల్లం, మినుము లాంటి వాటిని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే బెల్లం, మినుము వేడి స్వభావం కలవు. అయితే చలికాలంలో పెరుగు కూడా తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది చలికాలంలో పెరుగు తినడం వల్ల జలుబు చేస్తుందని అనుకుంటారు కానీ పులియపెట్టిన పెరుగులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. సోడియం, కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ప్రతిరోజు ఒక గిన్నెడు పెరుగు తినాలని నిపుణులు సూచనలు చేస్తున్నారు. Curd

Is it safe to eat curd in winters
పెరుగులో కాల్షియం ఉండడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయని వెల్లడించారు. పెరుగును ఫ్రిడ్జ్ లో అసలు పెట్టకూడదని చెబుతున్నారు. తాజా పెరుగు మాత్రమే తినాలని చెబుతున్నారు. ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. చలికాలంలో బయట ఉంచిన పెరుగును మాత్రమే తినడం ఆరోగ్యానికి మంచిది. పెరుగు తింటే కడుపుకు మేలు కలుగుతుంది. కడుపులో చల్లగా, హాయిగా ఉంటుంది. దీనిని తినడం ద్వారా కాలేయం లేదా కడుపు ఆరోగ్యంగా మారుతాయి. Curd
Also Read: Telangana Thalli: తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం..బతుకమ్మ ఎక్కడా ?
పెరుగు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. పెరుగులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఈ మూలకం రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. ఉష్ణోగ్రత వద్ద మజ్జిగ రూపంలో దీనిని తినడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఇదివరకే జలుబు లేదా దగ్గు సమస్యలు ఉన్నవారు పెరుగు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు మాత్రమే పెరుగు తినాలని వైద్య నివేదికలో వెళ్లడైంది. Curd