Balakrishna: బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఘనుడు.. ఓవైపు సినిమాలను మరోవైపు రాజకీయాలను ఇంకో వైపు తన సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి.. కాస్త కోపం ఎక్కువ కానీ ఎంతో దాన గుణం కలిగినటువంటి హీరో. తండ్రి నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినిమా ఇండస్ట్రీలో, రాజకీయాల్లో ఎదిగారు.. ఇప్పటికీ ఏడు పదుల వయసు దగ్గరికి వస్తున్నా కానీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ నటిస్తున్నారు.
Good news for Nandamuri fans Balakrishna that award
సినిమాలే కాకుండా అన్ స్టాపబుల్ అనే టాక్ షో ద్వారా కూడా మరింత పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. అలాంటి బాలకృష్ణ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు.. ఎంతోమందికి జీవితాన్ని అందించారు. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే..ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్ల ప్రస్థానం కొనసాగుతోంది. దీంతో ఆయనను పద్మ విభూషణ్ అనే అవార్డుతో సత్కరించాలని సర్కారు భావిస్తోందట. (Balakrishna)
Also Read: Sai Pallavi: ఆ హీరో కౌగిలిలో బందీ అయిన సాయి పల్లవి..?
ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పద్మ విభూషణ్ లిస్టులో బాలకృష్ణ పేరును కూడా నామినేట్ చేస్తూ కేంద్రానికి ప్రపోజల్ పంపిందట. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా ఈ పద్మ అవార్డులను ప్రకటిస్తుంది. ఈ క్రమంలోనే 2025 ఏడాదికి గాను ఏపీ నుంచి బాలకృష్ణ పేరు వెళ్లడంతో ఈయనకు తప్పకుండా పద్మ విభూషణ్ అవార్డు వస్తుందని చాలామంది అభిమానులు భావిస్తున్నారు.
ఆయన సినిమాల్లో చరిత్ర సృష్టించడమే కాకుండా హిందూపురం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే బసవతారకం క్యాన్సర్ అనే ఆసుపత్రి ద్వారా ఎంతో మంది పేదలకు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తూ అదరహో అనిపిస్తున్నారు. ఇలా ఎన్నో ట్రస్టుల ద్వారా పేద విద్యార్థులకు చదువు అందిస్తున్నారు. ఇలా ఎన్నో మంచి పనులు చేస్తున్న ఆయనకు ఈ అవార్డు ఇవ్వడం తప్పనిసరి అంటూ నందమూరి అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.(Balakrishna)