SKN: ఇక పిసుక్కోండి అంటూ మెగా ఫ్యాన్స్ కి బేబీ నిర్మాత వార్నింగ్.. ఎందుకంటే..?
SKN: మెగా ఫ్యాన్స్ కి బేబీ నిర్మాత ఎస్కేన్ వార్నింగ్ ఎందుకు ఇచ్చారు.. తన ఎక్స్ ఖాతాలో ఆ వీడియో షేర్ చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. నిర్మాత ఎస్కేఎన్ మెగా అల్లు ఫ్యామిలీకి మధ్య వారధిలా ఉంటారు. ఈయన వీరి ఫ్యామిలీ మధ్య గొడవలు ఉన్నాయి అంటూ రూమర్స్ వస్తే ఖచ్చితంగా దానిపై స్పందించి అలాంటిదేమీ లేదు అని క్లారిటీ ఇస్తారు .
SKN warning to mega fans
అయితే అలాంటి ఎస్కేఎన్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో అల్లు అర్జున్ పుష్ప టు సక్సెస్ మీట్ లో స్పెషల్ గా కళ్యాణ్ బాబాయ్ కి థాంక్స్ అంటూ చెప్పిన వీడియోని షేర్ చేశారు. ఇక వెంటనే అఆ మూవీలోని రావు రమేష్ అజయ్ మధ్య జరిగే కామెడీ సన్నివేశాన్ని చూపిస్తూ ఇప్పుడేం చేద్దాం నాన్న అంటే ఇంకేముంది పిసుక్కోవడమే అనే కామెడీ డైలాగ్ వీడియో కూడా షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో మెగా అల్లు ఫాన్స్ మధ్య గొడవలు ఉన్నాయి.(SKN)
Also Read: Pragya Nagra Responds: ప్రగ్యా నాగ్రా AI ఫేక్ వీడియో వివాదం.. హీరోయిన్ ఏమన్నదంటే?
అని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసే సెలబ్రిటీలకు కొంతమంది ఫ్యాన్స్ ముసుగు వేసుకొని నెగటివ్ కామెంట్స్ చేసే వారిని ఉద్దేశించి పోస్ట్ చేసినట్టు అయింది. అంతేకాదు వీడియోలు పోస్ట్ చేసి “చెప్పేది నీలాంటి వాళ్లకే.. ఫ్యామిలీ హీరోల మీద పిచ్చిపిచ్చి డిబేట్ లు పెట్టే షోలకి వెళ్ళకు..ఒకవేళ వెళ్లినా కూడా ఫ్యామిలీ హీరోలపై పిచ్చి పిచ్చి కామెంట్లు చేయకు.ఫ్యామిలీ హీరోలు మాత్రమే కాదు ఇంకా వేరే హీరోల మీద కూడా ఇలాంటి కామెంట్లు ఎప్పుడు చేయకు.
చాలా రోజుల నుండి ఆన్లైన్లో ఏదో కొట్టుకుంటున్నారు. అది ఇప్పటికైనా ఆపేయండి అంటూ” ఈ రెండు వీడియోలు షేర్ చేసి ఈ పోస్ట్ పెట్టడంతో చాలామంది నెటిజెన్స్ ఈయన పెట్టింది పరోక్షంగా మెగా ఫ్యాన్స్ కి సెట్ అవుతుంది. ఎందుకంటే చాలా రోజుల నుండి పుష్ప-2ని ఫ్లాప్ చేయాలని ఏవేవో కొంతమంది నెగటివ్ కామెంట్లు చేశారు. వాళ్లకి ఇది పర్ఫెక్ట్ పోస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.(SKN)