KTR: రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉంటే ఆ తర్వాత పదేళ్లు మేము అధికారంలో ఉంటామని గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఈ ఐదేళ్లు రేవంత్ రెడ్డే సీఎంగా ఉండాలని కోరారు కేటీఆర్. తాజాగా లగచర్ల బాధితులను ఢిల్లీకి తీసుకువెళ్లారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు కేటీఆర్. KTR

KTR Sensational Comments On Revanth Reddy

లగచర్ల గ్రామంలో పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని ఆగ్రహించారు.తెలంగాణ ముఖ్యమంత్రి… రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లోనే ఇలాంటి సంఘటనలు జరిగాయని… కానీ దీనిపై ఇప్పటివరకు ఆయన స్పందించలేదని మండిపడ్డారు. కానీ ఆయన సోదరుడు తిరుపతిరెడ్డి స్పందిస్తున్నాడని నిప్పులు జరిగారు. అసలు ఎవరు తిరుపతిరెడ్డి….? తెలంగాణలో రేవంత్ రెడ్డి కుటుంబ పాలన కొనసాగుతోందని ఆగ్రహించారు. KTR

Also Read: KCR: KCR ఫామ్ హౌస్ కు అక్కినేని కుటుంబం ?

లగచర్ల ఘటనపై రాహుల్ గాంధీ అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించాలని డిమాండ్ చేశారు. మణిపూర్ సంఘటనపై రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు కానీ… కొడంగల్ నియోజకవర్గంలో జరిగే అరాచకాల పై స్పందించడం లేదని నిప్పులు చెరిగారు.తిరుపతి రెడ్డి ఏమైనా డిఫ్యాక్టో ముఖ్యమంత్రా?సీఎం సోదరుడు అయినంత మాత్రాన ఆయన చెప్పింది నడవాలా? అని ఫైర్ అయ్యారు. KTR