Dhanush: ధనుష్..చూడటానికి ఏమాత్రం హీరో రూపం లేని ఈయన సినిమాలు మొత్తం సూపర్ హిట్ అవుతూ ఉంటాయి. అలాంటి ధనుష్ తెలుగు,తమిళ,మలయాళ ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల పరంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈయన తన సొంత లైఫ్లో మాత్రం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ఎప్పుడైతే తన భార్య ఐశ్వర్యకు విడాకులు ఇస్తానని చెప్పారో అప్పటినుంచి ఈయనను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి.
Dhanush who showed dots to that heroine for 3 days for not fulfilling her wish
అలాంటి ఈ తరుణంలో తాజాగా నయనతార వివాదం రెండు ఇండస్ట్రీలలో సంచలనం సృష్టించింది. ఇది మరువక ముందే మరో మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రముఖ వెబ్ చాట్ ఛానల్ కి చెందినటువంటి అంతనన్ అనే వ్యక్తి ధనుష్ కీర్తి సురేష్ ని వేధించిన విషయాలను బయటపెట్టారు. ఆయన మూడు రోజులపాటు కీర్తి సురేష్ ను టార్చర్ చేశారని, చివరికి కీర్తి సురేష్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఏడ్చింది అని కూడా చెప్పుకొచ్చారు. (Dhanush)
Also Read: Naga Chaitanya: సమంత వేస్ట్.. శోభిత బాగా అర్థం చేసుకుంటుంది..?
అయితే కీర్తి సురేష్ ధనుష్ కాంబినేషన్లో తమిళంలో తోడారి (తెలుగు లో రైలు) అనే చిత్రం వచ్చిన విషయం అందరికి తెలుసు. ఈ సినిమాకు ప్రభు సాలమన్ డైరెక్షన్ చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో కీర్తి సురేష్ ను నాతో అలా ఉండాలని ధనుష్ అడిగారట. కానీ ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెపై కోపం పెంచుకున్న ధనుష్ ఆమెను మూడు రోజులపాటు ఎన్నో ఇబ్బందులు పెట్టారట.. చివరికి ఆ ఇబ్బందులను భరించలేక కీర్తి సురేష్ ఒక చిన్న షార్ట్ తీయడానికి మూడు రోజులు టైం తీసుకుందట..
అలా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఆమె కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూసిందని అంతనన్ తెలిపారు. చివరికి ఆయన టార్చర్ భరించలేక కీర్తి తన తండ్రి జి సురేష్ కుమార్ కు కాల్ చేసి చెప్పిందట. ఆయన ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత కాబట్టి వెంటనే ఈ విషయాన్ని రజినీకాంత్ కు చెప్పడంతో , ఆయన ధనుష్ కు ఫోన్ చేసి గట్టిగా మందలించాడట. ఇంకోసారి ఆ అమ్మాయి జోలికి పోతే బాగుండదు అంటూ చెప్పుకొచ్చారట. ఈ విషయాన్ని అంతనన్ బయట పెట్టడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దీంతో నెటిన్లు పలు రకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.(Dhanush)