Mustard: ఆవాలు తింటున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే ?
Mustard: ప్రతికూరలో తాలింపునకు వేసే అర చెంచా ఆవాలు కూర రుచిని, సాంబార్ వంటి వంటకాల రుచిని ఒక్కసారిగా పెంచేస్తాయి. ఆవాల పొడి వేయడం వల్ల ఊరగాయ పచ్చళ్ళు గుమగుమలాడుతాయి. ప్రతి ఇంట్లో ఆవాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఆవాలతో పాటు ఆవాకు తినే అలవాటు చాలా తక్కువ మందికి ఉంటుంది. కానీ ఆవాకు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహారా నిపుణులు చెబుతున్నారు. పాలకూర, మెంతికూర వలే ఆవాకు కూడా వీలైనప్పుడు తినాలని చెబుతున్నారు. Mustard
Health Issues With Mustard
ఆవాకును పెసర, కంది, శనగపప్పులతో కలిపి తినవచ్చు. దీన్ని ఆలివ్ నూనెలో వేయించి కారం, వెల్లుల్లి, ఉప్పు, నిమ్మరసం వేస్తే చాలా బాగుంటుంది. సలాడ్ రూపంలో అయితే పిల్లలు ఆవాకును తినడానికి చాలా బాగా ఇష్టపడతారు. ఆవాకు రుచిగా ఉండడమే కాకుండా ఎన్నో రకాల పోషకాలను అందిస్తుంది. ఇందులో విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, రాగి, ప్రోటీన్ సహా అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఆవాకు శరీరాన్ని వేడిగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె, కంటి, చర్మ వ్యాధులను దూరం చేస్తుంది. ఆవాకులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. Mustard
Also Read: Telangana: కాంగ్రెస్ ఏడాది పాలనపై సంచలన సర్వే.. రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగలనుందా ?
డయాబెటిస్, గుండె జబ్బులు ఉన్నవారు ఆవాకును తప్పకుండా తినాలి. దీనిని తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. ఎముకలు, దంతాలు బలంగా తయారవుతాయి. ఎసిడిటీ పొట్టలో గ్యాస్ తో సహా జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు సైతం ఆవాకు తినవచ్చు. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు ఆవాకును తప్పకుండా తినాలి. కిడ్నీలో రాళ్లు లేదా కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఆవాలు తినడం పూర్తిగా మానేయాలి. ఎందుకంటే ఇందులో ప్యూరీనాతో పాటు ఆక్సలైట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మూత్రపిండాల సమస్యలు ఎక్కువగా అవుతాయి. Mustard