Bunny unfulfilled desire

Bunny: అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో బ్యాక్ గ్రౌండ్ కలిగినటువంటి హీరో. ఆయనకు అంత బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ తన సొంత నటన టాలెంట్ తోనే ఎదిగగలిగారని చెప్పవచ్చు.. ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉండగానే సరిపోదు ఎదగాలంటే నటన టాలెంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అది 100% అల్లుఅర్జున్ లో ఉందని చెప్పవచ్చు. ఆయన ఏ పాత్రలో అయినా నటించడం కాదు దూరిపోతారు. అలాంటి అల్లు అర్జున్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన వ్యక్తి.

Bunny unfulfilled desire

ఇక పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి గుర్తింపు సాధించారో మనందరికీ తెలుసు. ప్రస్తుతం దానికి సీక్వెల్ గా పుష్ప2 రాబోతోంది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ అంతా కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. ఇలా ఆయన సినిమా కెరియర్ కొనసాగుతున్న తరుణంలో తాజాగా బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్నటువంటి అన్ స్టాపబుల్ సీజన్ 4 ప్రోగ్రాంకి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయనే కాకుండా తన తల్లి పిల్లలు కూడా ఈ షోకి వచ్చారు. దీంతో బాలకృష్ణ అల్లు అర్జున్ ఫ్యామిలీకి మధ్య అద్భుతమైన చిట్ చాట్ జరిగింది. (Bunny)

Also Read: Nani: నాని లవ్ స్టోరీ.. పెళ్లికి ముందే అలా..?

ప్రస్తుతం ఈ ఎపిసోడ్ రెండు పార్ట్ లుగా స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయి ఓటీటీలో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. అయితే ఈ షోలో బాలకృష్ణ అల్లు అర్జున్ ను ఒక క్యూస్షన్ అడిగారు. జీవితంలో తీరని కోరిక ఏదైనా ఉందా అని అడిగాగానే అల్లు అర్జున్ టక్కున ఒక కోరిక ఉంది, అది ఇక తీరనిది అంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఆ కోరిక ఏంటయ్యా అంటే వారికి సినీ లైఫ్ అందించినటువంటి తన తాత అల్లు రామలింగయ్యతో నటించడం.. అయితే ఇండస్ట్రీలోకి అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో గంగోత్రి సినిమాలో ఆయనతో నటిద్దాం అనుకున్నారట. కాస్త సెట్ అయ్యాక నటిద్దామని వదిలేసారట.

Bunny unfulfilled desire

ఆ తర్వాత ఆర్య సినిమాలో తాతయ్యను చిన్న పాత్రలో అయినా తీసుకొద్దామని భావించారట. ఎందుకో మళ్లీ వదిలేసారట. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం చెడిపోయి మరణించారు. దీంతో ఆ ఘనుడితో నేను నటించలేకపోయానని అల్లు అర్జున్ చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఆయన లేకుంటే మా ఫ్యామిలీ ఉండేది కాదు నేను ఇంతటి హీరోని అయ్యే వాడిని కాదు అంటూ బాధపడ్డారు. నాకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఆయన ఉండి ఉంటే ఇంకా సంతోషించేవారని చెబుతూ చాలా ఫీల్ అయ్యారు అల్లు అర్జున్. ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులంతా బన్నీ అన్న నువ్వు బాధపడొద్దు, నువ్వు ఇంకా ఎదిగితే ఆయన ఆత్మ శాంతిస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Bunny)