Keerthy Suresh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ ఎంతటి ఘనత సాధించిందో మనందరికీ తెలుసు.. హిట్స్ ఫ్లాప్స్ అనే తేడా లేకుండా మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. అలాంటి కీర్తి సురేష్ పేరు గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా మారుమోగిపోతోంది. దీనికి ప్రధాన కారణం ఆమె ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందట. ఆమె వివాహమాడే అబ్బాయి కూడా తన చిన్ననాటి స్నేహితుడని తెలుస్తోంది.
Keerthy Suresh aunt is in a shocking condition
ప్రస్తుతం వారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆమె పెళ్లి నిజమేనని అభిమానులు భావిస్తూ వస్తున్నారు.. ఇంతకీ ఆమె చేసుకోబోయే అబ్బాయి ఎవరయ్యా అంటే ఆంటోనీ తట్టిల్.. అయితే వీరిద్దరూ చిన్నప్పటినుంచి మంచి స్నేహితులట. ఇద్దరు ఒకటే స్కూల్లో చదివి టెన్త్ క్లాస్ లోనే లవ్ లో పడి ఆ లవ్ ను ఇప్పటివరకు కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఎక్కడ కూడా లిమిట్స్ దాటకుండా ఉండి చివరికి పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. (Keerthy Suresh)
Also Read: Dhanush: కోరిక తీర్చలేదని 3 రోజులు ఆ హీరోయిన్ కి చుక్కలు చూపించిన ధనుష్..?
తాజాగా కీర్తి సురేష్ తండ్రి నిర్మాత సురేష్ కూడా ఈ విషయాన్ని కన్ఫామ్ చేసేశారు. వీరి పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం ఇంకా తెలియలేదు. అయితే పెళ్లి అనగానే అబ్బాయి తరఫున ఉన్నవాళ్లు వివిధ కండిషన్లు పెడుతూ ఉంటారు. అలాగే తట్టిల్ తల్లి కూడా కీర్తి సురేష్ కు కండిషన్ పెట్టిందట.. ఇంతకీ ఆ కండిషన్ ఏంటంటే పెళ్లి తర్వాత సినిమాల్లో నటించు కానీ, బోల్డ్ పాత్రల్లో మాత్రం నటించవద్దని చెప్పిందట. దీనికి కీర్తి సురేష్ తో పాటు వారి ఫ్యామిలీ కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
తట్టిల్ ఫ్యామిలీ బిజినెస్ ఫ్యామిలీ. వివాహం తర్వాత బోల్డ్ పాత్రలో నటిస్తే వారికి కాస్త ఇబ్బంది అవుతుందని చెప్పిందట. ఈ కండిషన్ ను కీర్తి సురేష్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో వీరి పెళ్లి ఎప్పుడా అని అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు.. మరి చూడాలి కీర్తి సురేష్ పెళ్లి తర్వాత సాంప్రదాయ పాత్రలో నటిస్తుందా? లేదంటే అత్త మాటను కట్ చేసి బోల్డ్ పాత్రలు కూడా చేస్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.(Keerthy Suresh)