Jani Master: జానీ మాస్టర్ ఇక కొరియోగ్రఫీకి దూరం అవ్వాల్సిందే.. డాన్సర్స్ అసోసియేషన్ నుండి బ్యాన్.?
Jani Master: ఏంటి జానీ మాస్టర్ ని డాన్స్ అసోసియేషన్ నుండి బ్యాన్ చేశారా.. ఈ మధ్యనే బెయిల్ ద్వారా జైలు నుండి బయటకు వచ్చిన జానీ మాస్టర్ కి ఇది పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. మరి నిజంగానే జానీ మాస్టర్ ని బ్యాన్ చేశారా అనేది ఇప్పుడు చూద్దాం.. డాన్స్ కొరియోగ్రఫీలో కొత్తదానాన్ని చూపిస్తూ ఎంతోమందిని తన కొరియోగ్రఫీతో అలరించిన జానీ మాస్టర్ నేషనల్ అవార్డును సైతం అందుకున్నారు.
Jani Master Banned From Dancers Association
అయితే ఈయన నేషనల్ అవార్డు అందుకోవడానికి కొద్ది రోజుల ముందు ఆయన దగ్గర పనిచేసే లేడీ కొరియోగ్రాఫర్ లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ జానీ మాస్టర్ పై కేసు పెట్టడంతో ఇది కాస్త ఇండస్ట్రీలో పెద్ద సంచలనం సృష్టించింది.అయితే ఈ కేసులో కొంతమంది ఆ లేడీ కొరియోగ్రాఫర్ కి సపోర్ట్ గా ఉంటే మరి కొంతమంది జానీ మాస్టర్ కి మద్దతు తెలిపారు.ఇక జానీ మాస్టర్ అరెస్టు అయిన సమయంలోనే నేరం రుజువైతే కచ్చితంగా డాన్స్ అసోసియేషన్ నుండి బ్యాన్ చేస్తాం అని చెప్పారు.(Jani Master)
Also Read: Pushpa-2: పుష్ప-2కి షాక్.. యూట్యూబ్లో స్ట్రీమింగ్ .. ఇక్కడ చూడండి.?
అయితే రీసెంట్గా బెయిల్ మీద బయటకు వచ్చిన జానీ మాస్టర్ కి తాజాగా పెద్ద షాక్ తగిలినట్టు అయింది. అదేంటంటే.. ఆదివారం రోజు డాన్సర్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరిగాయి.ఈ ఎలక్షన్స్ లో జోసెఫ్ ప్రకాష్ భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు . దీంతో చాలామంది ఈయనకు విషెస్ తెలిపారు. అయితే డాన్సర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన రోజే జానీ మాస్టర్ పై జోసెఫ్ ప్రకాష్ వేటు వేసినట్టు తెలుస్తోంది..
డాన్సర్స్ అసోసియేషన్ నుండి జానీ మాస్టర్ ని శాశ్వతంగా బ్యాన్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో చాలామంది ఈ విషయం తెలిసి నేరం రుజువు కాకముందే జానీ మాస్టర్ ని ఎలా బ్యాన్ చేస్తారు అని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు..మరి నిజంగానే ఆయన్ని బ్యాన్ చేశారా.. మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ లో ఎంత నిజం ఉందో తెలియాలంటే జానీ మాస్టర్ స్పందించాల్సిందే అంటున్నారు ఆయన అభిమానులు.(Jani Master)