Rakul Preet Singh: ఆ హీరో తో రకుల్ డేటింగ్.. పెళ్లయినా వదలట్లేదా.?
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్.. నార్త్ నుండి వచ్చిన ఈ ముద్దుగుమ్మ సౌత్ లో కూడా సత్తా చాటి ఆ తర్వాత మళ్ళీ నార్త్ లోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం సౌత్ సినిమాలకు దూరంగా ఉన్న ఈమె ఈ ఏడాది నిర్మాత జాకీ భగ్నానిని పెళ్లి చేసుకొని తనపై వచ్చే పెళ్లి,ప్రేమ రూమర్స్ కి చెక్ పెట్టేసింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ పెళ్లికి ముందే ఎంతో మందితో డేటింగ్ చేసినట్టు వార్తలు వినిపించాయి అందులో ఒకరు దగ్గుబాటి రానా..

Rakul Preet Singh dating that hero
కండలు తగిన మస్కిలర్ బాడీతో ఎంతో అట్రాక్టివ్ గా కనిపించే దగ్గుబాటి రానా అంటే ఇష్టపడని అమ్మాయి ఉండరు.ముఖ్యంగా ఈయనకు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది.ఇక అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండే రానా ఫ్రెండ్స్ లిస్టులో కూడా ఎంతోమంది నార్త్ సౌత్ హాట్ హీరోయిన్లు ఉన్నారు. అందులో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. (Rakul Preet Singh)
Also Read: Samantha: పెళ్లైన హీరోకి ప్రపోజ్ చేసిన సమంత..?
రకుల్ ప్రీత్ సింగ్,రానా కాంబినేషన్లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ వీరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇక ఫ్రెండ్షిప్ వార్తలు కాస్త డేటింగ్ వార్తల వరకు చక్కర్లు కొట్టడంతో వీరిద్దరూ డేట్ చేస్తున్నారనే వార్త అప్పట్లో మీడియాలో వైరల్ అయింది. అయితే రానాతో డేటింగ్ పై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్ అలాంటిది ఏమీ లేదు..

రానా నాకు మంచి ఫ్రెండ్ అని బుకాయించింది. కానీ ఆ తర్వాత రానాతో చాలాసార్లు పార్టీలు, పబ్బులు అంటూ రకుల్ తిరుగుతూ మీడియా ముందు అడ్డంగా బుక్ అయింది. దీంతో వీరి డేటింగ్ వార్తలు అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాయి.కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు అటు రానా పెళ్లి అయిపోయింది.ఆ తర్వాత రానా కి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ కూడా పెళ్లి చేసుకుంది దీంతో వీరి మధ్య డేటింగ్ వార్తలు అక్కడితో ఆగిపోయాయి.(Rakul Preet Singh)