Telangana Thalli: తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్పు ?


Telangana Thalli: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత… కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎవరికి నచ్చిన విధానాన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ లోగోను మార్చారు. అలాగే టీఎస్ ను కాస్త టీజీ గా మార్చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక అటు… తెలంగాణ తల్లి విగ్రహం కూడా మారిపోయింది. Telangana Thalli

Telugu thalli flyover name change

డిసెంబర్ 9 అంటే నిన్నటి రోజున తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించారు రేవంత్ రెడ్డి. ఈ విగ్రహంలో తెలంగాణ తల్లికి కిరీటంతో పాటు బతుకమ్మ చేతిలో లేదు. దీంతో ఈ తెలంగాణ తల్లి… విగ్రహం ఏర్పాటు పై గులాబీ పార్టీ నిధులతో విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. తెలంగాణ వాదులు కూడా ఆగ్రహం వ్యక్తం.. చేస్తున్నారు. Telangana Thalli

Also Read: Revanth Reddy: కాంగ్రెస్ ఏడాది పాలన…కేసీఆర్ కన్నా రేవంత్‌కే ఎక్కువ వ్యతిరేకత ?

అయితే ఇలాంటి నేపథ్యంలో సెక్రటేరియట్ దగ్గర ఉన్న తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పేరును మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా మార్చాలని కోరారు. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయట. Telangana Thalli

https://twitter.com/TeluguScribe/status/1866050041623822440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *