Allu Arjun: “వాడు హీరోనా ఎర్ర చందనం దొంగ”.. అల్లు అర్జున్ పై హీరో షాకింగ్ కామెంట్స్.?
Allu Arjun: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పుష్ప2 సినిమా ఎంతటి రికార్డులు క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలుసు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పాత్ర..ఈ పాత్రలో ఆయన ఎంతో బాగా నటించాడు కానీ ఈ సినిమా ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. తాజాగా హీరో, నటుడు, కమెడియన్ అయినటువంటి రాజేంద్రప్రసాద్, అల్లు అర్జున్ పై వ్యతిరేక కామెంట్లు చేసినట్టు తెలుస్తోంది..అదేంటో చూద్దాం..
Hero shocking comments on Allu Arjun
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తాజాగా హరికథ అనే వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ అవ్వబోతోంది. ఈ వెబ్ సిరీస్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. మ్యాగీ డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఈ వెబ్ సిరీస్ లో రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, శ్రియ గొట్టం, ఉషశ్రీ, తదితరులు నటిస్తున్నారు. ఈనెల 13వ తేదీన స్ట్రీమింగ్ అవ్వబోతున్న ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో అట్టాహాసంగా నిర్వహించారు.. (Allu Arjun)
Also Read: Mohan Babu: అన్ని గొడవలకు కోడలే కారణం..7 నెలల మనవరాలిని పనిమనిషికి ఇచ్చి..?
ఈ సందర్భంగా నటుడు రాజేంద్రప్రసాద్ చాలా ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.. నేను ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు 50 సంవత్సరాలు దగ్గరికి వస్తోంది. నేను ఎన్నో అద్భుత కథలలో ఎంతో మంది హీరోలతో నటించానని, ఆనాటి తరం హీరోలతో మొదలుకొని ఈనాటి తరం హీరోలతో కూడా నటిస్తున్నానని చెప్పారు.
ఈ మధ్యకాలంలో హీరోలు చాలా డిఫరెంట్ పాత్రలు చేస్తున్నారని, నిన్న కాక మొన్న వాడెవడో ఎర్ర చందనం దుంగల దొంగ పాత్రలో హీరోగా చేసాడు. ప్రస్తుతం హీరోల మీనింగ్స్ మారిపోయాయి అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఆయన అల్లు అర్జున్ ను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కామెంట్లు చేశారని కొంతమంది నేటిజన్స్ అంటున్నారు..(Allu Arjun)