Guava Fruit: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కొంతమంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ వంటింటి ఆహారాన్ని మాత్రమే తింటారు. ఇక మరికొందరు ఏమో ఆరోగ్యం గురించి అసలు పట్టించుకోకుండా ఎక్కువ శాతం బయట ఆహారాన్ని తింటూ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇక చాలామంది ఆరోగ్యం గురించి ఆలోచించిన వారు, ఆలోచించని వారు ప్రతి ఒక్కరూ ఫ్రూట్స్ తింటూ ఉంటారు. ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి ఒక్కరూ రోజు రెండు మూడు రకాల ఫ్రూట్స్ అయినా తినాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. Guava Fruit
Health Benefits of Guava Fruit
ఇక ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరికి జామ పండు అంటే చాలా ఇష్టం. ఇది నచ్చని వారంటూ ఎవరు ఉండరు. ఇక ముఖ్యంగా జామ పండు సీజనల్ ఫ్రూట్ అని చెప్పవచ్చు. కానీ ఎక్కువగా వర్షాకాలంలో జామకాయల సీజన్ ఎక్కువగా ఉంటుంది. జామకాయలను తినడం వల్ల చాలా వరకు లాభాలు ఉంటాయో అదే క్రమంలో నష్టాలు కూడా ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక జామకాయ తినడం వల్ల తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు నశిస్తాయి. గ్యాస్ట్రిక్, అల్సర్ వంటి సమస్యలు తొలగిపోతాయి. డయాబెటిస్, బీపీ వంటి సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా షుగర్ పేషెంట్లకు జామకాయ ఒక వరం లాంటిది. Guava Fruit
Also Read: OnePlus 11R Mobile: రూ. 40వేల ఫోన్ రూ. 27వేలకే..పూర్తి వివరాలు ఇవే
ఎందుకంటే ఇందులో నీటిశాతం ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. చాలావరకు దంత సమస్యలు తొలగిపోతాయి. ఇక జామకాయ తినడం వల్ల జలుబు వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ ఇందులో వాస్తవం ఎంత ఉందనేది ఎవరికీ తెలియదు. చాలా వరకు జామకాయ తినడం వల్ల జలుబు సమస్యలు తొలగిపోతాయని అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇందులో విటమిన్స్, కాల్షియం అధికంగా ఉంటాయి. అందువల్ల శరీరానికి కాలుష్యం విపరీతంగా లభిస్తుంది. Guava Fruit
ఇక వీటిని అధికంగా తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటంటే…. జామకాయలు ఎక్కువగా తినడం వల్ల దగ్గు వస్తుంది. అంతేకాకుండా ఈ జామ పండు శరీరంలో ఒళ్ళు నొప్పులు వచ్చేలా చేస్తుంది. ఇక చిన్న పిల్లలకు జామ పండు ఎక్కువగా తినిపించకూడదు. దీని వల్ల వారికి జ్వరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చిన్నపిల్లలకి వారంలో రెండు లేదా మూడుసార్లు మాత్రమే జామ పండు తినిపించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు తినిపిస్తే వారికి అనారోగ్యం సంభవిస్తుందని వైద్య నివేదికలో వెళ్లడైంది. Guava Fruit