Chandra babu: ఏపీలో దెబ్బతిన్న రోడ్లమీద ఫోకస్ చేయబోతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేడు రోడ్లు మరియు భవనాల శాఖపై సమీక్ష సమావేశాన్ని జరపబోతున్నారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులు దుస్థితిపై చర్చించబోతున్నారు. వర్షా కాలం రహదారులు మరింత దెబ్బ తినే అవకాశం ఉంది కనుక ప్రజలు ఇబ్బంది పడకుండా ముందు గోతులు పూడ్చేలా చర్యలకు ఆదేశించనున్నారు. గత ఇదేళ్ళుగా రహదారుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాలని రోడ్లు ఘోరంగా దెబ్బ తిన్నాయని విమర్శలు లేకపోలేదు. వర్షాకాలం వచ్చిందంటే చాలు రోడ్లపైకి రావాలంటే భయం కలుగుతోంది.
Chandra babu focus on roads
టీడీపీ, జనసేన వివిధ సందర్భాల్లో ప్రత్యేక క్యాంపైన్లు కూడా నిర్వహించారు. రోడ్ల దుస్థితి పై జనసేన సోషల్ మీడియా వేదికగా క్యాంపైన్ నిర్వహించిన విషయం తెలిసిందే ఇప్పుడు రోడ్ల పరిస్థితి పై దృష్టి సారించారు చంద్రబాబు. ఈరోజు జరిగే సమావేశంలో రహదారి మౌలిక వస్తువుల వసతుల నిధితో విస్తరించాల్సిన రోడ్డు తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఓ వైపు సమీక్ష సమావేశాలు ఇంకో వైపు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు.
మొదట పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. సమీక్ష నిర్వహించి పనుల పురోగతి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం విదేశీ నిపుణులను రంగం లోకి దింపారు. మరో పక్క రాజధాని ప్రాంతం లో పర్యటించి భవనాల నిర్మాణం పనులు ఎక్కడికి వచ్చాయి అన్న దాని గురించి సమీక్ష నిర్వహించి అమరావతి పనుల్లో కదలిక తెచ్చారు తర్వాత సొంత నియోజకవర్గ కుప్పంలో పర్యటించి వరాల జల్లు కురిపించారు (Chandra babu).