Varun Chakravarthy: రూ.1400లకు సినిమాల్లో చేశాడు..కానీ ఇప్పుడు టీమిండియా హీరో అయ్యాడు ?
Varun Chakravarthy: వరుణ్ చక్రవర్తి. మూడేళ్ల అనంతరం భారత జట్టులోకి వచ్చి సత్తా చాటుతున్నాడు వరుణ్ చక్రవర్తి. ఇప్పుడు అందరూ వరుణ్ చక్రవర్తి గురించి మాట్లాడుకుంటున్నారు. అతను టీం ఇండియా T20 జట్టులోచూపిస్తున్న ఆటతీరు అందరిని ఆకట్టుకుంటుంది. జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్న నేపథ్యంలో వరుణ్ చక్రవర్తి లైఫ్ స్టోరీ తెలుసుకోవడానికి కొంతమంది ఆసక్తిని చూపిస్తున్నారు.
Varun Chakravarthy’s Inspiring Journey From Films to Team India
ఈ క్రమంలోనే తాజాగా వరుణ్ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంలో కొన్ని విషయాలను షేర్ చేసుకున్నాడు. ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో భాగంగా వరుణ్ మాట్లాడుతూ…. టీమిండియా, ఐపీఎల్ మ్యాచులు ఆడడానికి ముందు సినిమాల్లో కూడా పనిచేశాను. 2024 సంవత్సరంలో క్రికెట్ ఉత్తమ ‘జీవ’లో అతిధి పాత్రలో నటించానని వరుణ్ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అంతేకాకుండా తాను అసిస్టెంట్ డైరెక్టర్ కావాలనుకున్నట్లు చెప్పాడు.
Also Read: Sri Sathya: అందరూ చిన్న గా ఉందంటున్నారు..అందుకే సర్జరీ తప్పలేదు.. బిగ్ బాస్ ఫేమ్!!
కానీ దురదృష్టవశాత్తు అసిస్టెంట్ డైరెక్టర్ కాలేకపోయాను. కానీ రెండు మూడు సన్నివేశాలు ఉన్న చిత్రంలో అతిథి పాత్రలో నటించాను. ఆ సినిమాలో పనిచేస్తున్నప్పుడు నాకు రోజుకు రూ. 1400 రూపాయలు వచ్చేవి. వాటితోనే కాలం గడిపే వాడినని వరుణ్ చక్రవర్తి వెల్లడించాడు. కాగా, 2019లో ఐపీఎల్ లోకి అరంగేట్రం చేసిన వరుణ్ చక్రవర్తి 2021లో భారత్ తరపున తొలి మ్యాచ్ ఆడడం జరిగింది.
ఐపిఎల్ లో 71 మ్యాచ్లు ఆడి 83 వికెట్లు తీసిన మిస్టరీ స్పిన్నర్ గా వరుణ్ నిలిచాడు. భారత్ తరపున ఆడిన 6 టీ20 మ్యాచుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం వరుణ్ చక్రవర్తి బంగ్లాదేశ్ తో టి20 మ్యాచ్ లు ఆడెందుకు సిద్ధంగా ఉన్నాడు. బంగ్లాదేశ్ తో టీమ్ ఇండియా 3టీ20 మ్యాచ్ లు ఆడనుంది.