Ms Dhoni: RCBపై కోపంతో..టీవీ పగలగొట్టిన ధోనీ ?

Ms Dhoni: టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మైదానంలో ఎంత ప్రశాంతంగా ఉంటాడో ప్రత్యేకంగా అతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితులలోనైనా తన భావోద్వేగాలను అస్సలు బయటపెట్టడు. జట్టు ఓడినా, గెలిచినా తన సంతోషాన్ని పంచుకోడు. దాంతోనే ధోనిని అందరూ మిస్టర్ కూల్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ధోని కూడా తన భావోద్వేగాలను ప్రదర్శించేవాడని, తన కోపాన్ని అదుపు చేసుకోలేని ఘటనలు చాలా ఉన్నాయని అతనితో కలిసి ఆడిన కొంతమంది ఆటగాళ్లు ఒక్కో సందర్భంలో తాజాగా వెల్లడిస్తున్నారు.

MS Dhoni Loses Cool and Breaks TV in Dressing Room After RCB Match

MS Dhoni Loses Cool and Breaks TV in Dressing Room After RCB Match

ధోని కోపంతో డ్రెస్సింగ్ రూమ్ వెలుపల ఉన్న స్క్రీన్ ను బద్దలు కొట్టాడని ఆ మ్యాచ్ కు కామెంటేటర్ గా ఉన్న భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ ఆకరి దశలో ఆర్సిబి, సిఎస్కే మధ్య జరిగిన మ్యాచ్ తో చివరి ప్లే ఆప్స్ బెర్తు ఖరారు అయింది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే చెన్నై ప్లే ఆప్స్ కు చేరుకునేది. కానీ కీలక మ్యాచ్లో సీఎస్కే తడబడిపోయింది.

Also Read: Aryaman Birla: వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్‌.. ధోని కోహ్లీని మించిన సంపద ?

చివరి ఓవర్లో 18 పరుగులు చేస్తే చెన్నై నాకౌట్ కు వెళ్లే అవకాశాలు ఉండేవి. కానీ ఆర్సిబి బౌలర్ ఏడు పరుగులు ఇచ్చి ఎంఎస్ ధోని వికెట్ ను తీశాడు. ఈ మ్యాచ్లో సంచలన విజయంతో బెంగుళూరు ప్లేఆప్స్ కు చేరుకుంది. దీంతో ఆర్సిబి ఆటగాళ్లు సంబరంలో మునిగిపోయారు. చెన్నై ప్లేయర్లతో కరచాలనం చేసేందుకు కాస్త సమయాన్ని తీసుకున్నారు. అదే సమయంలో ధోని డ్రెస్సింగ్ రూమ్ వెలుపల ఉన్న స్క్రీన్ ను బద్దలు కొట్టాడని హర్భజన్ సింగ్ తాజాగా తెలిపారు. ఈ విషయం తెలియడంతో ధోని అభిమానులు ఏంటి ఎప్పుడు కూల్ గా ఉండే ధోనీకి ఇంత కోపం కూడా వస్తుందా అని కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *