Bigg Boss8: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలేకి గెస్ట్ గా అల్లు అర్జున్.. ఆ రికార్డ్స్ బ్రేక్..?
Allu Arjun: బిగ్ బాస్ తెలుగు ఇండస్ట్రీలోని రియాల్టీ షోలలో అద్భుతమైన పేరు సంపాదించుకున్నటువంటి షో. ఇప్పటికే ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్, ఎనిమిదవ సీజన్ కూడా ఈ ఆదివారంతో ముగియనుంది. అలాంటి బిగ్ బాస్ షో ఫైనలిస్టుగా ఎవరు నిలుస్తారనేది ఆసక్తిగా మారింది. బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ కి కప్ ఇవ్వడానికి చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తారు అనేది కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది.
Allu Arjun as a guest for Bigg Boss 8 grand finale
ఈ కారణంలో బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్ గా పుష్పరాజ్ వస్తారని బన్నీ చేతుల మీదుగానే ట్రోఫీ అందజేస్తారని ఒక వార్త సోషల్ మీడియా వైరల్ అవుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో ఎంతవరకు అబద్ధం ఉందో తెలుసుకుందాం.. ప్రస్తుతం బిగ్ బాస్ లో ఫైనలిస్టులుగా నిఖిల్, ప్రేరణ, నబిల్ ,గౌతమ్,అవినాష్ లు ఉన్నారు. ఇందులో మొదటి ఫైనలిస్టుగా అవినాష్ ఉన్నారు. (Allu Arjun )
Also Read: Samantha: 2025లో పెళ్లి పిల్లలు.. సమంత షాకింగ్ పోస్ట్.. రెండో పెళ్లి గురించేనా.?
రెండో ఫైనలిస్టుగా నిఖిల్ మూడో ఫైనలిస్ట్ గా గౌతమ్, నాలుగు, ఐదులో ప్రేరణ,నబీల్ లు ఉన్నారు. ఇక విన్నర్ ఓటింగ్ లో మాత్రం టాప్ రెండు స్థానాల్లో గౌతమ్, నిఖిల్ లు నిలువగా, వీరిద్దరి ఓటింగ్ శాతం లో మార్పులు లేవు కానీ ఓట్లలో స్వల్ప తేడాలు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా చివరి వరకు ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇదే తరుణంలో బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ కు ట్రోఫీ అందించడానికి అల్లు అర్జున్ వస్తారని తెలుస్తోంది..
అయితే తాజాగా పుష్ప-2 సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ మంచి క్రేజ్ మీద ఉన్నారు. ప్రస్తుతం ఆయనను ఫైనలే కి తీసుకువస్తే షో మరింత ఆసక్తికరంగా మారుతుంది. అందుకే అల్లు అర్జున్ ను బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ కు ట్రోఫీ ఇవ్వడానికి తీసుకువస్తారనే వార్తలు జోరందుకున్నాయి. మరి చూడాలి ఆయన వస్తారా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.(Allu Arjun )