India-Australia 3rd Test: మూడో టెస్ట్ లో భారత ఆటగాళ్లకు చుక్కలే.. రోహిత్ సేన కు పెద్ద పరీక్ష!!

India-Australia 3rd Test: బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికపై భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ శనివారం, డిసెంబర్ 14న జరగనుంది. ప్రస్తుతం ఇరు జట్లు సిరీస్‌లో చెరో మ్యాచ్ గెలిచి 1-1 సమానంగా ఉన్నాయి. సిరీస్‌లో ఆధిక్యం సాధించాలంటే ఈ మూడో టెస్టు చాలా కీలకం. కేవలం సిరీస్ గెలుచుకోవడమే కాక, ఈ మ్యాచ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చేరేందుకు కూడా చాలా ముఖ్యమైనది.

Brisbane Hosts India-Australia 3rd Test

Brisbane Hosts India-Australia 3rd Test

గబ్బా పిచ్: పేసర్లు కోసం స్వర్గధామం

ఈసారి గబ్బా పిచ్ మరింత పేసీ, బౌన్సీగా ఉంటుంది. గబ్బా వేదిక ఆస్రేలియాలోని అన్ని పిచ్‌లతో పోల్చితే పేసర్లకు అనుకూలమైనది. ఈ సారి గబ్బా క్యూరేటర్ ఈ టెస్టు కోసం అదనపు పేస్ మరియు బౌన్స్ కలిగిన పిచ్‌ను రూపొందించాడని తెలిపారు. “పిచ్‌ లో మార్పులు సీజన్‌కు అనుగుణంగా ఉంటాయి. అయితే, ఈ సారి కూడా పిచ్‌ను పేస్‌కు అనుకూలంగా, బౌన్సీతో తయారు చేశాం. బ్యాటర్లకు ఇది ఛాలెంజింగ్ వికెట్ అవుతుంది,” అని గబ్బా క్యూరేటర్ వెల్లడించారు.

Also Read: Keerthy Suresh Wedding: ఘనంగా హీరోయిన్ కీర్తీ సురేష్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు!!

భారత జట్టు ప్రాక్టీస్ సెషన్

భారత జట్టు, మూడో టెస్టుకు సిద్ధమయ్యేందుకు బుధవారం, డిసెంబర్ 11న బ్రిస్బేన్ చేరుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్, మరియు ఇతర స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు బ్రిస్బేన్ విమానాశ్రయం నుండి హోటల్‌కి చేరుకుంటున్న వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. రెండో టెస్టు ముగిసిన వెంటనే మంగళవారం (డిసెంబర్ 10) ఆటగాళ్లంతా అడిలైడ్‌లో ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా భారత స్టార్స్ చాలా సేపు కష్టపడినట్లు కనిపించారు.

గబ్బాలో భారత్‌కు గెలుపు జ్ఞాపకాలు

గబ్బా వేదికపై భారత్‌కు మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. 2021లో జరిగిన ఆస్రేలియా పర్యటనలో గబ్బాలో భారత్ విజయం సాధించింది. ఆ సమయంలో భారత్ 33 సంవత్సరాలలో గబ్బా వేదికపై టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించిన తొలి పర్యాటక జట్టు గా రికార్డు క్రియేట్ చేసింది. కీలక ఆటగాళ్ల గాయాల మధ్య, భారత్ 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 138 బంతుల్లో 89 పరుగులు చేసి, గబ్బాలో కంగారూల గర్వాన్ని అణిచాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *