Xiaomi 14T Pro: ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. నిన్న మొన్నటి వరకు 4జీ ఫోన్ల ట్రెండ్ నడిచింది. ప్రస్తుతం 5జీ ఫోన్ల ట్రెండ్ నడుస్తోంది. స్మార్ట్ ఫోన్లు అతి తక్కువ ధరకే రావడంతో ప్రతి ఒక్కరు వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా కంపెనీదారులు విక్రయాలు పెంచుకోవడానికి స్మార్ట్ ఫోన్లను అతి తక్కువ ధరకే ఇండియన్ మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. Xiaomi 14T Pro
Xiaomi 14T Pro spotted on IMDA, global launch imminent
ఈ క్రమంలోనే తాజాగా షియోమీ సంస్థ నుంచి అదిరిపోయే ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి రాబోతుంది. Xiaomi 14T Pro అనే పేరుతో స్మార్ట్ ఫోన్ తీసుకురాబోతున్నారు. ఇక ఈ ఫోన్ Xiaomi 14T Pro మోడల్ నెంబర్ తో థాయిలాండ్ సర్టిఫికేషన్ లో గుర్తించబడింది. ఈ సిరీస్ లో ఇప్పుడు NBTC సర్టిఫికేషన్ Xiaomi 14T Pro ఆమోదించింది. దీని ద్వారా థాయిలాండ్ లో ఈ సిరీస్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇక ఈ ఫోన్లో స్పెసిఫికేషను విషయానికి వస్తే…. Xiaomi 14T ప్రో ట్వీక్డ్ వెర్షన్ అని పేర్కొంటుంది. Xiaomi 14T Pro
Also Read: Samsung Galaxy F54: సామ్సంగ్ నుంచి అదిరిపోయే ఫోన్..ధర, ఫీచర్స్ ఇవే
ఇక ఈ ఫోన్లో 50 మెగా పిక్సెల్ కెమెరా, 32 మెగా పిక్సెల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇక ఇందులో K70 అల్ట్రా కంటే మెరుగైన కెమెరాల సెటప్ అందుబాటులో కలదు. Xiaomi 14T ప్రో OLED ప్యానెల్ 1.5K రిజల్యూషన్, 154Hz రిఫ్రెష్ రేటుతో అందుబాటులో కలదు. ఇది డైమన్సిటీ 9300+ చిప్ సెట్ కలిగి ఉంటుంది. Xiaomi 14T Pro
పవర్ కోసం 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5,500mAh బ్యాటరీ వస్తుంది. ఈ ఫోన్లో స్టోరేజ్ విషయానికొస్తే 16GB వరకు స్టోరేజ్ తో రావచ్చు. ఇది మెటాలిక్ ఫ్రేమ్, IP68- రేటెడ్ ఛాసిస్ ను కలిగి ఉంటుంది. ఇక ఈ ఫోన్ ఈ నెలాఖరులోపు చైనాలో లాంచ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఫోన్ కొనుగోలు చేయాలని ఆసక్తితో ఉన్నవారు కొద్ది రోజులు వెయిట్ చేసి ఈ ఫోన్ ని కొనుగోలు చేయడం మంచిది. Xiaomi 14T Pro