Rajinikanth: రజినీకాంత్ జీవితంలోనే చెరిగిపోని మచ్చ.. స్టార్ నటితో ఎఫైర్.?
Rajinikanth: పాన్ ఇండియా అనే పదం లేక ముందే పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో రజినీకాంత్ ఒకరు. ఈయనకు అందం లేకపోయినా కానీ తన స్టైల్ మేనరిజంతో అద్భుతంగా నటిస్తూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి రజినీకాంత్ సినిమాలు, తన కుటుంబం తప్ప ఇంకో విషయంలో వేలు పెట్టరు.
An indelible scar in Rajinikanth life
అలాంటి ఆయన అప్పట్లో ఒక బీ గ్రేడ్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డారని ఇద్దరు వారి రిలేషన్ చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేశారనే వార్తలు వినిపించాయి.. మరి ఆమె ఎవరు వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అప్పట్లో తిరుగులేని నటిగా పేరు సంపాదించుకుంది సిల్క్ స్మిత. (Rajinikanth)
Also Read: Keerthy Suresh Wedding: ఘనంగా హీరోయిన్ కీర్తీ సురేష్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు!!
వ్యాంపు పాత్రలంటే ఈమె పేరు గుర్తుకు వచ్చేది.. అప్పట్లో సిల్క్ స్మిత రజినీకాంత్ తో కలిసి తంగ మగాన్, పాయంపులి, జిత్తు హమారీ, వంటి చిత్రాలు చేసింది. ఈ సినిమాలు ఎక్కువ హిట్ అవడంతో సిల్క్ స్మిత పేరు ఎక్కడికో వెళ్లిపోయింది.. అలా వరుస సినిమాలు చేయడంతో వీరి మధ్య ఏదో నడుస్తుందని అప్పట్లో అనేక కథనాలు వచ్చాయి.
దీనిపై స్పందించిన సిల్క్ స్మిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను తలైవాతో ప్రేమలో పడ్డానని తనంటే ఎంతో ఇష్టమంటూ చెప్పకనే చెప్పేసింది. దీంతో తమిళ మీడియా పత్రికలు విపరీతంగా కథనాలు రాసాయి. కానీ రజినీకాంత్ ఏనాడు కూడా వీటిపై స్పందించలేదు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి.(Rajinikanth)