Time Deposit: ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డబ్బులను ఆదా చేసుకుంటున్నారు. అనేక రకాల స్కీముల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు కూడా డబ్బుల్ని సేవ్ చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ స్కీమ్ గురించి చూడాల్సిందే. పోస్ట్ ఆఫీస్ అనేక రకాల స్కీములని అందిస్తుంది పోస్ట్ ఆఫీస్ ఐదేళ్ల FD స్కీము గురించి ఇప్పుడు చూద్దాం. ఈ స్కీంతో అద్భుతమైన లాభాలని పొందవచ్చు. ఇందులో లక్ష పెడితే ఎంత వస్తుంది అనే విషయాన్ని కూడా చూసేద్దాం… కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పోస్టల్ విభాగం పలు రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలని అందిస్తోంది.

Post office Time Deposit scheme details

సామాన్య మధ్య తరగతి ప్రజలు పొదుపు చేసుకునేలా ఈ పథకాలను రూపొందించడంతో ఆదరణ లభిస్తుంది. ఇలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన రాబడి అందించడంతో వీటిలో డబ్బులు దాచుకునేందుకు ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ప్రధానంగా పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్లకు మంచి ఆదరణ ఉంది బ్యాంకు ఫిక్స్ డిపాజిట్ మాదిరిగా ఉంటాయి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గరిష్ట వడ్డీ రేటు కల్పిస్తోంది. ఇటీవల జూలై సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేట్లు ప్రకటించింది పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల టెన్యూర్ కలిగి ఉంటాయి. కనీసం 1000 నుండి డిపాజిట్ చేయొచ్చు. గరిష్ట పరిమితంటూ ఏమీ లేదు.

Also read: Recharge Plans: మూడు నెలల రీచార్జ్‌పై.. అదిరే ఆఫర్లు…!

ప్రస్తుతం ఏడాది టైం డిపాజిట్ లో 6.9% వడ్డీ వస్తుంది రెండేళ్ల డిపాజిట్ పై ఏడు శాతం వడ్డీ వస్తుంది ఐదేళ్ల కాల పరిమిత డిపోసిట్ లపై గరిష్టంగా 7.5%. వడ్డీని మూడు నెలలకు ఒకసారి లెక్కిస్తారు. ఏడాదికి ఒకసారి మాత్రమే చెల్లిస్తారు ఖాతాదారుడి సేవింగ్స్ ఖాతాలో ఈ వడ్డీ జమ అవుతుంది. వ్యక్తిగతంగా లేదా గరిష్టంగా ముగ్గురి వరకు జాయింట్ ఖాతా తెరవచ్చు. పదేళ్లు నిండిన మైనర్లు కూడా ఖాతా తీసుకోవచ్చు. ఏడాది టైం డిపాజిట్ ఎంచుకుని లక్ష రూపాయలు జమ చేస్తే 6.9 శాతం వడ్డీ రేటు తో మెచ్యూరిటీ తర్వాత చేతికి 1,07,081 వరకు వస్తాయి. రెండేళ్ల టైం డిపాజిట్ పై 14,888 వడ్డీ వస్తుంది మూడేళ్ల టైం డిపాజిట్ పై మొత్తం 1,23500 వస్తాయి ఐదేళ్లకి లక్ష జమ చేస్తే వడ్డీ రేటు 7.5% వర్తిస్తుంది అంటే రూ. 1, 44, 995 వస్తాయి (Time Deposit).