Allu Arjun Arrest: దారుణం.. అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్..సంధ్య తొక్కిసలాట కేసులో శిక్ష ఇదే!!
Allu Arjun Arrest: టాలీవుడ్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో భారీ సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకి సంబంధించిన వివిధ చర్చలు మరియు అభిప్రాయాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. పలురకాల వాదనల తర్వాత అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ ను విధించింది కోర్టు. ఇది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించే వార్త అని చెప్పాలి.
Allu Arjun Arrest 14 Days Remand
పుష్ప సినిమా ప్రీమియర్స్ సమయంలో అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చినప్పుడు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సమయంలో తీవ్రమైన తొక్కిసలాట జరిగింది, దీనివల్ల ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది, ఆమె కొడుకు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరాడు. అదృష్టవశాత్తు, ఆ బాలుడు ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు ముందుగా సంబంధిత సమాచారాన్ని అందించలేదని ఆరోపిస్తున్నారు.
Also Read: Allu Arjun Case: చంచల్‌గూడ జైలు వద్ద భారీ బందోబస్తు.. అల్లు అర్జున్ జైలుకేనా?
ఇక అరెస్ట్‌కు వచ్చిన పోలీసుల వ్యవహారంపై అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశారు.తెలంగాణ సీఎం ఈ అంశంపై స్పందిస్తూ, చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొని, ఈ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుంటుందని తెలిపారు. అలాగే, తన జోక్యం ఈ విషయంలో ఉండదని చెప్పారు.
ఇక, విపక్ష నేతలు అల్లు అర్జున్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, “పాలకుల అభద్రతా భావానికి ఇది పరాకాష్ఠ” అని ఆరోపించారు. అల్లు అర్జున్ను సాధారణ నేరస్తుడిగా ట్రీట్ చేయడం సరికాదని చెప్పారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా ఈ ఘటనను తప్పుబట్టి, “తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం దురదృష్టకరమైనది” అని చెప్పారు.