Nagarjuna: ఏంటి నాగార్జున కన్నీళ్లు పెట్టుకున్నారా… ఆయనకు అంత బాధ ఎందుకు వచ్చింది.. అసలు నాగచైతన్య ఇల్లు వదిలి ఎందుకు వెళ్లిపోయారు..ఎందుకు అంతలా భావోద్వేగానికి నాగార్జున గురయ్యారు అనే సంచలన విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. అక్కినేని ఫ్యామిలీలో నాగేశ్వరరావు తర్వాత మళ్లీ అంతటి గుర్తింపు సంపాదించుకున్నది నాగార్జున మాత్రమే.ఈయన ఇప్పటికి కూడా సినిమాల్లో రాణిస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు.మరీ ముఖ్యంగా కొడుకుల సినీ లైఫ్ ని నిలబెట్టడం కోసం ఎన్నో కసరత్తులు చేస్తున్నప్పటికీ అది కుదరడం లేదు.
Naga Chaitanya who left home.. Nagarjuna who shed tears
అయితే తాజాగా నాగార్జున గురించి ఒక షాకింగ్ విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే నాగచైతన్య ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో నాగార్జున కన్నీళ్లు పెట్టుకున్నారట.ఇక ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు అంటే అది ఇప్పటి విషయం కాదు.నాగచైతన్య చిన్నతనంలో..అసలు విషయం ఏమిటంటే.. నాగార్జున అమలకి పెళ్లి కాకముందే నాగార్జున రామానాయుడు కూతురు లక్ష్మిని పెళ్లి చేసుకుని చేసుకున్నాడు. వీరికి నాగచైతన్య పుట్టాక ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి డివోర్స్ తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. (Nagarjuna )
Also Read: Nagarjuna: ఆ హీరోయిన్ తో రిలేషన్ నా భార్యకు తెలుసు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్.?
ఇక నాగార్జున లక్ష్మికి విడాకులు ఇచ్చాక చట్ట ప్రకారం పుట్టిన పిల్లలు ఓ ఏజ్ వచ్చే వరకు తల్లి దగ్గరే ఉంటారు కాబట్టి నాగచైతన్య లక్ష్మీ దగ్గరే పెరిగారు. అయితే సమ్మర్ లో మాత్రం నాగార్జున దగ్గరికి వచ్చేవారట.ఆ సమయంలో నాగార్జున తన కొడుకు రావడంతో ఎంతగానో సంతోషించేవారట. అంతేకాదు నాగచైతన్యకి ఏమేం ఇష్టమో అవన్నీ క్షణాల్లో ఇచ్చేవారట. ఇక నాగచైతన్య వస్తే అఖిల్ కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యేవాడట.అన్నయ్య అంటూ మొత్తం చైతన్య చుట్టే తిరిగేవారట. అలా ఇద్దరు ఎంతో హ్యాపీగా ఆడుకునే వారట. నాగార్జునకి కూడా కొడుకు వచ్చిన సమయంలో ఎంతో సంతోషంగా ఉండేదట.
కానీ సమ్మర్ అయిపోయి మళ్లీ నాగచైతన్య లక్ష్మీ దగ్గరికి వెళ్లే సమయంలో చైతు తనకు సంబంధించిన వస్తువులన్నీ బ్యాగ్ లో సర్దుకుంటున్న సమయంలో నాగార్జున చాలా బాధపడిపోయేవారట.తన మనసులో అంత బాధ పెట్టుకొని లోలోపల ఎంతగానో ఏడ్చేవారట. అంతేకాదు నాగచైతన్య బట్టలన్నీ బ్యాగ్ లో పెట్టుకొని కారెక్కి వెళ్ళిపోయాక ఇంట్లో తన బెడ్ రూమ్ లో కూర్చొని వెక్కివెక్కి ఏడ్చేవారట. అలా చాలా సంవత్సరాలు నాగచైతన్య ఇల్లు వదిలి వెళ్లిపోయిన సమయంలో ఎవరికి తెలియకుండా ఏడ్చేవాడినంటూ నాగార్జుననే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు.(Nagarjuna )