Pawan Kalyan: టైం చూసి కొట్టిన పవన్.. ఆ ఒక్క ట్వీట్ తో బన్నీపై పగ తీర్చుకున్నాడుగా..?
Pawan Kalyan: అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మధ్య ఎప్పుడు ఏదో ఒక రభస సాగుతూనే ఉంటుంది. పగ రగులుతూనే ఉంటుంది. అయితే తాజాగా అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేసి చంచల్గూడా జైలుకు తరలించారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. డిసెంబర్ 13 శుక్రవారం మధ్యాహ్నం ఆయన్ని పోలీసులు అరెస్టు చేయడంతో బన్నీ అభిమానులంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
Pawan Kalyan took revenge on Bunny with that one tweet
ఇదే తరుణంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు చిరంజీవి ఇతర వ్యక్తులు సపోర్ట్ గా నిలిచారు. ఇదే క్రమంలో బన్నీ అరెస్టుపై తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఆయన ఏమన్నారు అయ్యా అంటే.. కలిసి ఉంటే నిలబడతాం.. విడిపోతే పడిపోతామంటూ పోస్ట్ చేశారు..(Pawan Kalyan)
(United we Stand divided we fall) ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతుంది.. దీనిపై పలువురు పవన్ అభిమానులు కరెక్ట్ టైమింగ్ లో పర్ఫెక్ట్ పోస్టు చేశావు అన్నా అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ఏది ఏమైనా అల్లు అర్జున్ వ్యవహారం మాత్రం మీడియాలో విపరీతంగా హాట్ టాపిక్ అయిందని చెప్పవచ్చు. ఇదే తరుణంలో ఆయనను శనివారం ఉదయం 6 గంటలకు జైలు నుంచి విడుదల చేశారు.
ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి చట్టానికి లోబడి ఉంటానని, చట్టాన్ని గౌరవిస్తానని, నేను గత కొన్ని ఏళ్లుగా సంధ్యా థియేటర్లో సినిమా చూస్తున్నానని, ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని అన్నారు. నాకు సపోర్ట్ చేసిన అభిమానులకు అందరికీ ధన్యవాదాలు అంటూ తెలియజేశారు.. ఆయన ఇంటికి రాగానే దగ్గర కుటుంబ సభ్యులంతా హగ్ చేసుకుని ఎమోషనల్ అయ్యి దిష్టి తీసి లోపలికి ఆహ్వానించారు.(Pawan Kalyan)