Vijay: ఒకే హోటల్ రూమ్ లో ఆ హీరోయిన్ తో విజయ్.. సంగీతకు న్యాయం చేయాలంటూ.?
Vijay: తమిళ, తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో హీరో విజయ్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన తన నటన అభినయంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే విజయ్ ఎంత పేరు సంపాదించుకున్నారో పలువురు హీరోయిన్స్ తో రిలేషన్స్ లో ఉండి కూడా అంతే నెగిటివిటీ కూడా సంపాదించుకున్నారు. అలాంటి విజయ్ తాజాగా ఆ స్టార్ హీరోయిన్ తో చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారట. మరి ఆ హీరోయిన్ ఎవరు ఆ వివరాలు ఏంటో చూద్దాం..
Vijay with that heroine in the same hotel room
తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపుతున్న సూపర్ సీనియర్ హీరోయిన్ త్రిష అంటే తెలియని వారు ఉండరు. ఇప్పటికే నాలుగు పదుల వయసు దాటి ముందుకు వెళ్తోంది. ఈమె తోటి హీరోయిన్స్ అందరు పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కూడా కంటున్నారు. కానీ త్రిష మాత్రం పెళ్లి అనే మాట ఎత్తకుండా సినిమాల్లో దూసుకుపోతోంది. అలాంటి ముద్దుగుమ్మ తాజాగా తన స్నేహితురాలైన కీర్తి సురేష్ పెళ్లికి హాజరైంది. (Vijay)
Also Read: Nayanthara: షూటింగ్లో నయనతారను టార్చర్ చేసిన సీనియర్ హీరో.?
అయితే ఈ పెళ్లికి తాను ఒక్కతే వెళ్లలేదట. తనతోపాటు విజయ్ ని తీసుకెళ్లిందట. అంతేకాదు వీరు అక్కడికి వెళ్లడమే కాకుండా ఒకే రూము తీసుకొని రాత్రంతా గడిపారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.. వీరి మధ్య ఏదో నడుస్తుందని, అందుకే రాత్రంతా ఒకే రూమ్ లో గడిపారని, కలిసి తిరుగుతున్నారని పెట్టింటా వార్తలు ట్రోల్ అవుతున్నాయి.
ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా జస్టిస్ ఫర్ సంగీత అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. దీనిపై విజయ్ ఏ విధంగా స్పందిస్తారనేది ముందు ముందు తెలుస్తుంది. అయితే ఈ మధ్యకాలంలోనే విజయ్ హీరోగా వచ్చిన గోట్ సినిమాలో త్రిష ఐటమ్ సాంగ్ లో చేసిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచే వీరి మధ్య రిలేషన్ కాస్త పెరిగిపోయిందని తెలుస్తోంది.(Vijay)