Manoj: అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిన పంచదార.. మళ్లీ పోలీస్ స్టేషన్ కి మనోజ్.?
Manoj: ఏంటి మంచు ఫ్యామిలీలో గొడవలు ముగిసిపోయాయి అనుకునే లోపే మళ్ళీ గొడవ జరిగిందా.. విష్ణు మనోజ్ ల మధ్య పంచదార కారణంగా గొడవ జరిగి పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాడా.. ఇంతకీ పంచదార గొడవ ఏంటి.. అసలు మనోజ్ విష్ణులు ఎందుకు గొడవపడ్డారు అనేది ఇప్పుడు చూద్దాం. గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు ఏ విధంగా ఉన్నాయో చెప్పనక్కర్లేదు.
Manoj to the police station again
ప్రస్తుతం వీరి గొడవలు తగ్గిపోయినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా మరోసారి విష్ణు మనోజ్ ల మధ్య గొడవ జరిగినట్టు సమాచారం. ఇక విషయంలోకి వెళ్తే..మనోజ్ తన ఫ్రెండ్స్ అందరితో కలిసి జల్ పల్లి లోని నివాసంలో ఒక చిన్న పార్టీని అరేంజ్ చేసుకున్నారట. అయితే ఈ పార్టీకి విద్యుత్ కనెక్షన్ కోసం బయట నుండి జనరేటర్స్ ని తెప్పించారట మనోజ్. (Manoj)
Also Read: Mohan Babu: పరారీలో మోహన్ బాబు.. అరెస్ట్ కోసం వెళ్లిన పోలీసులకు దొరకని మోహన్ బాబు!!
కానీ ఈ విషయం నచ్చని విష్ణు తన మనుషుల ద్వారా మనోజ్ తెచ్చుకున్న జనరేటర్లలో పంచదార పోయించి అవి పనిచేయకుండా ఉండేలా చేశారట. అయితే అసలు విషయం తెలిసిన మనోజ్ అన్న విష్ణుతో వాగ్వాదానికి దిగి ఇద్దరూ గొడవలు పడినట్లు తెలుస్తోంది.
ఇద్దరి మధ్య స్వల్ప వివాదం తలెత్తడంతో మంచు మనోజ్ మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళబోతున్నట్టు సమాచారం అందుతుంది.అయితే ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్స్ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిన పంచదార అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.(Manoj)