Nayanthara: విజ్ఞేష్ ని పెళ్లి చేసుకొని సిగ్గు పడుతున్న నయన్.. పెళ్లి చేసుకోకుంటే బాగుండు..?
Nayanthara: ఏంటి నయనతార విగ్నేష్ శివన్ ల జీవితంలో వేణు స్వామి చెప్పిందే నిజమవుతుందా.. ఎందుకు నయనతార విగ్నేష్ ని పెళ్లి చేసుకోకపోయి ఉంటే బాగుండు అని మాట్లాడింది. ఇంతకీ విగ్నేష్ కి నయనతార కి మధ్య ఎక్కడ చెడింది అనేది ఇప్పుడు చూద్దాం. నయనతార ఈ మధ్యకాలంలో తన డాక్యుమెంటరీ వల్ల ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఈ డాక్యుమెంటరీ వల్ల ధనుష్ తో గొడవలు జరిగి సోషల్ మీడియాలో హైలెట్ గా నిలిచింది.
Nayanthara who is ashamed of marrying Vignesh
అయితే ఎలాంటి నయనతార ఓ ఇంటర్వ్యూలో విగ్నేష్ శివన్ గురించి మాట్లాడుతూ.. నేను విజ్ఞేశ్ ని పెళ్లి చేసుకోకపోయి ఉంటే బాగుండు.. ఎందుకంటే ఆయన ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న స్టార్..కానీ నేను ఎప్పుడో ఎదిగాను..నా స్టార్డం ముందు ఆయన ఎదుగుదల ఎవరికి కనిపించలేదు. ఆయన లోపల ఎంతో టాలెంట్ ఉంది.కానీ నా ముందు ఆయన తక్కువే అని చాలామంది ఆయన్ని చులకనగా చూసారు. ఒకవేళ నేను ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఆయన తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకొని ఉండేవాడు.(Nayanthara)
Also Read: Manoj: అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిన పంచదార.. మళ్లీ పోలీస్ స్టేషన్ కి మనోజ్.?
కానీ నేను ఈరోజు పెళ్లి చేసుకోవడం వల్ల నా ముందు విజ్ఞేష్ శివన్ ని చులకనగా చూస్తున్నారు. నాకు అది నచ్చడం లేదు.విగ్నేష్ శివన్ కి టాలెంట్ ఎంతో ఉంది. కానీ ఆయన టాలెంట్ నిరూపించుకునే కంటే ముందే నేను ఆయనకు పరిచయమయ్యాను.నా పరిచయమే ఆయన టాలెంట్ కి అడ్డుపడింది అని నా అభిప్రాయం. ఒకవేళ నేను కలవక పోయి ఉండి ఆయన్ని పెళ్లి చేసుకోకపోయి ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది.ఎందుకంటే ఎంతోమంది ఆయన్ని ట్రోల్ చేశారు.
కానీ వాటిని నేను పట్టించుకోను అంటూ నయనతార విఘ్నేష్ శివన్ గొప్పదనం గురించి ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.ఎందుకంటే నయనతార విఘ్నేష్ శివన్ ల పెళ్లి సమయంలో ఎందుకు నయనతార విజ్ఞేశ్ శివన్ ని పెళ్లి చేసుకుంది. నయనతార చాలా పాపులర్..కానీ విజ్ఞేశ్ శివన్ అంత పాపులర్ కాదు. ఎందుకు అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటుంది అని ఎంతోమంది ట్రోల్ చేశారు. అయితే ఈ టోల్స్ కి నయనతార హర్ట్ అయ్యి ఈ మాటలు మాట్లాడినట్టు తెలుస్తోంది.(Nayanthara)