Allu Arjun: అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి.. రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయ్యాడా..?
Allu Arjun: అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి.. రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయ్యాడని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ని ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు… అనంతరం కేసీఆర్ క్రికెట్ కప్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… రైతుబంధును బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి అని ఫైర్ అయ్యారు. Allu Arjun
cm Revanth reddy hit wicket by Allu Arjun
యాదవులకు గొర్రెలను బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి… హైడ్రాను తెచ్చి ఇళ్లను కూలగొడుతున్నడు అని ఆగ్రహించారు. ఏడాదిగా కూలగొట్టుడే తప్ప ఒక్కటైనా కట్టావా రేవంత్ రెడ్డి? అని మండిపడ్డారు. అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి హిట్ వికెట్ అయిండు రేవంత్ రెడ్డి.. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి హిట్ వికెట్ అయిండు… లగచర్లలో రైతులని జైలో పెట్టి హిట్ వికెట్ అయిపోయిండు.. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడని చెప్పారు. Allu Arjun
Also Read: Manoj: అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిన పంచదార.. మళ్లీ పోలీస్ స్టేషన్ కి మనోజ్.?
ముఖ్యమంత్రిగా నీ పని అయిపోయింది.. కేసీఆర్ కప్‌ని మాణిక్ యాదవ్ నిర్వహించి నన్ను పిలవడం చాలా సంతోషం అని పేర్కొన్నారు. అమీన్‌పూర్‌తో నాకు మంచి అనుబంధం ఉంది… నీళ్ల బాధలు చూసిన.. ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దని వెల్లడించారు. మిషన్ భగీరథతో బిందెలు పట్టుకునే అవసరం లేకుండా చేసిన ఘనత కేసీఆర్‌ది అంటూ కొనియాడారు. Allu Arjun