HP chromebook: ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ లాప్టాప్ ని ఎక్కువగా వాడుతున్నారు. లాప్టాప్ వలన మన పనులు చాలా ఈజీ అవుతాయి. లాప్టాప్ కొనుగోలు చేయాలంటే కనీసం 30000 అయినా కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొంచెం మంచి ఫీచర్లు ఉన్న లాప్టాప్ అయితే కచ్చితంగా ఓ 40 వేల వరకు పెట్టాల్సి ఉంటుంది. మరి కేవలం 10000 లోనే లాప్టాప్ వస్తే బాగుంటుంది కదా..? ఇది అసాధ్యమని అనుకుంటున్నారా..? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో హెచ్పీ క్రోమ్ బుక్ పై అదిరిపోయే సేల్ లభిస్తోంది.

HP chromebook full details

హెచ్ పి క్రోమ్ 2024 పై భారీ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ క్రోమ్ బుక్ మీకు బాగా ఉపయోగ పడుతుంది. ఈ లాప్టాప్ ధర ఫీచర్ల గురించి మనం చూద్దాం.. హెచ్పి క్రోమ్ బుక్ 2024 అస్సలు ధర వచ్చేసి 34,554 ఫ్లిప్కార్ట్ లో మనం 68% డిస్కౌంట్తో 10,990 కే పొందవచ్చు దీనిపై మరింత డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు కి చెందిన క్రెడిట్ కార్డుతో కొనుగోలు చూస్తే 1250 డిస్కౌంట్ ఉంటుంది.

Also read: Aditi Agarwal: గంగోత్రి మూవీ హీరోయిన్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ హీరో నేనా…?

దీంతో ఈ లాప్టాప్ ని 10000 తోనే మీరు కొనుగోలు చేయొచ్చు. ఇక ఫీచర్ల గురించి చూస్తే.. 11.6 ఇంచెస్ తో కూడిన హెచ్డి ఐపిఎస్ డిస్ప్లేను ఇచ్చారు. 220 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఈ స్క్రీన్ వస్తుంది, 4gb ర్యామ్ 32gb ఇంటర్నల్ స్టోరేజ్ ని ఇచ్చారు. ఈ క్రోమ్ బుక్ లో క్రోమ్ ఆపరేటింగ్ సిస్టం ని ఇచ్చారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకుని వాడొచ్చు. కాలేజీ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఈ క్రోమ్ బుక్ బాగా హెల్ప్ అవుతుంది. ఈ లాప్టాప్ బరువు 1.34 కిలోలుగా ఉంది. దీని ధర 10000 మాత్రమే సూపర్ డీల్ కదా..? (HP chromebook)