Bigg Boss 8: బిగ్ బాస్ 8 టైటిల్ గెలిచిన నిఖిల్ బ్యాక్గ్రౌండ్.. ఎంత డబ్బు సంపాదించాడంటే..?
Bigg Boss 8: బిగ్ బాస్ 8 టైటిల్ ఎవరు కొడతారా అని ఎన్నో రోజుల నుండి ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల ఆత్రుతకు ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది.గత రెండు మూడు రోజుల నుండి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరో సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పెట్టారు పోస్టులు చేశారు.అయితే చివరి వరకు గౌతమ్, నిఖిల్ మధ్య టఫ్ ఫైట్ నడిచినప్పటికీ చివరికి కన్నడ వాడైనా నిఖిల్ కే బిగ్ బాస్ టైటిల్ వచ్చింది. అయితే తెలుగువాడైన గౌతమ్ ని కాదని కన్నడ వాడైనా నిఖిల్ కి టైటిల్ ఇవ్వడంలో చాలామంది పెదవి విరిచినప్పటికీ ఎక్కువ మంది మాత్రం నిఖిల్ కే సపోర్ట్ చేశారు.
Background of Nikhil who won the title of Bigg Boss 8
ఎందుకంటే గౌతమ్ తెలుగు వాడు అయినప్పటికీ ఆయన షో స్టార్ట్ అయ్యాక కొద్దిగా వారాలకు వచ్చాడు.కానీ ముందు నుండి నిఖిల్ హౌస్ లోనే ఉన్నాడు. ఇక నిఖిల్ కన్నడవాడైనప్పటికీ ఆయనకి హౌస్ లో చాలామంది సపోర్ట్. అలాగే హౌస్ బయట కూడా ఎంతోమంది బుల్లితెర ఆర్టిస్టులు ఆయనకు సపోర్ట్ ఇచ్చారు. ముఖ్యంగా మన టీవీ సీరియల్స్ లో చేసే ఎక్కువ శాతం మంది కన్నడ వాళ్లే కావడంతో నిఖిల్ కి మంచి మద్దతు లభించింది.అలాగే హౌస్ నుండి ఎలిమినేట్ అయినా ఎంతోమంది కంటెస్టెంట్లు కూడా తమ ఓట్లన్నీ నిఖిల్ కే వేయించారు. అలా నిఖిల్ చివరికి బిగ్బాస్8 టైటిల్ విన్నర్ అయ్యారు.(Bigg Boss 8)
Also Read: Prabhas: రహస్యంగా అనుష్కతో ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రభాస్.. ఫొటోస్ ఇక్కడ చూడండి.?
అయితే బిగ్బాస్ టైటిల్ విన్నర్ అయినటువంటి నిఖిల్ ₹55 లక్షల ప్రైజ్ మనీతో పాటు వారానికి 2.25 రెమినరేషన్ తో 15 వారాలకి గాను 33.75 లక్షలు సంపాదించారు.అలా మొత్తంగా నిఖిల్ 88 లక్షలను సంపాదించారు. డబ్బులతో పాటు మారుతీ సుజుకి డిజైర్ కార్ ను కూడా అందుకున్నారు. అలా మొత్తంగా నిఖిల్ బిగ్ బాస్ ద్వారా కోటి వరకు అందుకున్నట్టు సమాచారం అందుతున్నప్పటికీ అందులో జీఎస్టీ పోను నిఖిల్ కి అమౌంట్ తక్కువగానే వస్తుందని తెలుస్తోంది.
ఈ విషయం పక్కన పెడితే బిగ్బాస్ 8 టైటిల్ విన్నర్ అయినటువంటి నిఖిల్ గురించి ఎంతోమంది సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు.ఇక నిఖిల్ మైసూర్ లోని మాలియక్కల్ లో జన్మించారు.ఇక ఇండస్ట్రీ లోకి రాకముందు జాబ్ చేసిన నిఖిల్ ఆ తర్వాత నటనపై ఇంట్రెస్ట్ పెరగడంతో ఊటీ అనే సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని కన్నడ సీరియల్స్ చేసి చివరిగా తెలుగులో కూడా సీరియల్స్ చ్ శారు.ఇక ఈయన తెలుగులో గోరింటాకు, అమ్మకు తెలియని కోయిలమ్మ, ఊర్వశివో రాక్షసివో,చి.లా.సౌ. స్రవంతి వంటి సీరియల్స్ లో చేశారు.(Bigg Boss 8)