Bajaj Qute CNG Taxi: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల వాహనాలు వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏదీ లేదు. దేశవ్యాప్తంగా పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. చాలామంది కస్టమర్లు ప్రత్యామ్నాయలకు ఎదురుచూస్తున్నారు.ముఖ్యంగా… మన భారతదేశంలో ఉన్న కస్టమర్లు అందరూ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం మనం చూస్తున్నాం. Bajaj Qute CNG Taxi

Bajaj Auto announces imminent launch of Qute CNG, India’s first Auto Taxi

ఎవరు బైక్ కొనాలన్నా లేదా కారు కొనుగోలు చేయాలన్నా కూడా మొదటగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు.అలాగే… కొంతమంది కస్టమర్లు సిఎన్జి వాహనాలకు కోసం కూడా చూడడం జరుగుతుంది. అయితే తాజాగా…బజాజ్ కంపెనీ కూడా కీలక ప్రకటన చేసింది. ప్రపంచంలోనే తొలి సిఎన్జి బైక్ ను కూడా బజాజ్ ఆటో కంపెనీ రిలీజ్ చేసింది. Bajaj Qute CNG Taxi

Also Read: Bajaj Freedom 125 CNG: బజాజ్ నుంచి మార్కెట్లోకి తొలి CNG బైక్..213 కిమీ మైలేజ్ !

సిఎన్జి తో నడిచే తొలి ఆటో టాక్స్ ని కూడా తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది బజాజ్ కంపెనీ. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఇలా రిలీజ్ కావడం దేశంలోనే మొట్టమొదట కావడం విశేషం. ఇక ఇప్పటికే సిఎన్జి త్రీ వీలర్ రంగంలో తన సత్తాను బజాజ్ కంపెనీ చాటుతున్న సంగతి తెలిసిందే. Bajaj Qute CNG Taxi

ఇక తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు రకరకాల మోడల్ బైక్స్ తీసుకొస్తుంది. త్వరలో తీసుకురాబోయే సిఎన్జి ఆటో టాక్సీలో నలుగురు కూర్చునేలా… సీటింగ్ సిస్టం కూడా ఏర్పాటు చేయబోతుందట. సీఎన్జీ తో పాటు ఎల్పీజీ మోడల్ కూడా ఇందులో లభించేలా.. కసరత్తు చేస్తోందట బజాజ్. ఈ వాహనాలు తక్కువ ధరలో కూడా ఉండేలా ప్లాన్ చేస్తోందట. Bajaj Qute CNG Taxi