Amritha Aiyer: పెళ్లికి రెడీ అంటున్న హనుమాన్ హీరోయిన్.. అబ్బాయి అతడే..?
Amritha Aiyer: ఏంటి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఇంత తక్కువ కాలంలో హనుమాన్ హీరోయిన్ అమృత అయ్యర్ పెళ్లి చేసుకోబోతుందా.. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోబోయే ఆ అదృష్టవంతుడు ఎవరు? ఆయన ఏం చేస్తాడు అనేది ఇప్పుడు చూద్దాం.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీ తో ఓవర్ నైట్ లో స్టార్ గా పేరు తెచ్చుకుంది అమృత అయ్యర్..ఇక ఈ సినిమా తర్వాత అమృత చేసిన సినిమాలు అంతగా పేరు తెచ్చుకోకపోయినప్పటికీ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన హనుమాన్ మూవీతో అమృత అయ్యర్ కి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ లభించింది.
Amritha Aiyer Ready for marriage
ఈ సినిమాలో తేజ సజ్జా అమృత అయ్యర్ ల జోడి బాగా కుదిరింది. ఇక ఈ సినిమా హిట్ తో అమృత అయ్యర్ కి వరుస అవకాశాలు వస్తున్నాయి.అలా తాజాగా అల్లరి నరేష్ హీరోగా చేసిన బచ్చలమల్లి సినిమాలో కూడా అమృత అయ్యర్ హీరోయిన్ గా చేసింది. అయితే బచ్చలపల్లి మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న అమృత అయ్యర్ తన పెళ్లి గురించి హింట్ ఇచ్చేసింది..(Amritha Aiyer)
Also Read: Rajasaab: రాజా సాబ్ లో 4 హీరోయిన్స్.. ప్రభాస్ రొమాన్స్ మామూలుగా ఉండదా..?
మీ పెళ్లెప్పుడు అని అమృత అయ్యర్ ని యాంకర్ ప్రశ్న అడగగా.. నేను కచ్చితంగా 2025లో పెళ్లి చేసుకుంటాను అంటే వచ్చే సంవత్సరం అన్నమాట.. ఇక ఇండస్ట్రీ కి సంబంధించిన వ్యక్తిని కాకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అని అమృత అయ్యర్ క్లారిటిగా చెప్పేసింది.ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఇద్దరివి ఒకే రంగం కాబట్టి భేదాభిప్రాయాలు వచ్చి ఇద్దరి మధ్య ఈగో పెరిగిపోయి గొడవలు అయి విడాకులు అవుతాయి.
అందుకే సినిమా ఇండస్ట్రీకి చెందిన అబ్బాయిని కాకుండా వేరే ఇండస్ట్రీలో అబ్బాయిని పెళ్లాడుతాను అంటూ అమృత తెలిపింది.అయితే ఇండస్ట్రీ వ్యక్తిని కాకుండా వేరే అబ్బాయిని అంటే అమృత ఇప్పటికే బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్ లో ఉందని, అందుకే తన పెళ్లి గురించి ఈ విషయం చెప్పిందని,అలాగే వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి కారణం కూడా అమృత డేటింగ్ లో ఉండడం వల్లే అని తెలుస్తోంది.మరి అమృత అయ్యర్ ని పెళ్లి చేసుకోబోయే ఆ అదృష్టవంతుడు ఎవరో తెలియాల్సి ఉంది.(Amritha Aiyer)