Nirmala Devi: మనోజ్ అబద్దాలకోరు.. విష్ణు ఆ తప్పు చేయలేదు.. మనోజ్ తల్లి షాకింగ్ లేఖ.?
Nirmala Devi: మంచు ఫ్యామిలీ గొడవలు మీడియాలో ఎంత కాక రేపుతున్నాయో చెప్పనక్కర్లేదు. ఇక గొడవల సద్దుమణిగాయి అనుకునే లోపే మంచు మనోజ్ మళ్ళీ గొడవలను తెరపైకి తీసుకువచ్చాడు.మోహన్ బాబు భార్య నిర్మలా దేవి బర్త్డే వేడుకలు చేద్దామని ఫ్రెండ్స్ తో చిన్న పార్టీ అరేంజ్ చేసుకుంటే విష్ణు వచ్చి మేం బయట నుండి తెచ్చుకున్న జనరేటర్ లో పంచదార పోసి మమ్మల్ని చంపేయాలని చూసాడు.
Manoj mother Nirmala Devi shocking letter
నా కుటుంబంపై హత్య ప్రయత్నం చేశాడు జనరేటర్ లో చక్కెర పోయడం వల్ల విద్యుత్ లో హెచ్చు తగ్గులు వచ్చి భయభ్రాంతులకు లోనయ్యాం అంటూ పహాడి షరీఫ్ పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఫిర్యాదు పై మనోజ్ తల్లి నిర్మాలా దేవి సంచలన లేఖ విడుదల చేసింది.. నిర్మలా దేవి విడుదల చేసిన లేఖలో ఏముందంటే.. మనోజ్ తెచ్చిన జనరేటర్ లో విష్ణు చక్కర పోశాడు అంటూ మనోజ్ చేసిన ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదు.. (Nirmala Devi )
Also Read: Bunny: బన్నీ త్రివిక్రమ్ మూవీలో హీరోయిన్ ఫిక్స్.. హాట్ హీరోయిన్ నే పట్టేసారుగా..?
విష్ణు అలాంటి తప్పు చేయలేదు. మనోజ్ లేనిపోని అబద్ధాలు సృష్టించాడు.నా పుట్టిన రోజు నాడు జల్ పల్లి లోని మా నివాసానికి విష్ణు వచ్చి నాతో కేక్ కట్ చేయించి మా ఇంట్లో ఉన్న తన వస్తువులు తీసుకువెళ్లాలని రూమ్ లోకి వెళ్ళాడు. కానీ మనోజ్ మాత్రం జనరేటర్ల చక్కెర పోసాడని ఫిర్యాదు చేశాడు. అందులో ఎలాంటి నిజం లేదు.జల్ పల్లి లో ఉన్న మా నివాసం మీద మనోజ్ కి ఎంత హక్కు ఉందో విష్ణు కి కూడా అంతే హక్కుంది. నా పెద్ద కొడుకు అలాంటివాడు కాదు.
వాడు తన మనుషుల్ని పెట్టి ఎవరిపై దౌర్జన్యం చేయించలేదు. ఎలాంటి గొడవలు చేయలేదు. తప్పంతా మనోజ్ దే..మనోజ్ చేసిన ఫిర్యాదులో నిజం లేదు అంటూ కొట్టి పారేసింది ననిర్మలా దేవి. ఇక ఈ లేఖని పహాడి షరీఫ్ పోలీసులకు నిర్మాలా దేవి రాసింది. ప్రస్తుతం నిర్మలాదేవి లేఖ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ తప్పంతా మనోజ్ దేనని, లేనిపోని గొడవలు సృష్టిస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే సొంత తల్లే మనోజ్ పై ఈ కామెంట్లు చేయడంతో అందరూ నమ్ముతున్నారు.(Nirmala Devi )