Pushpa 2: ‘పుష్ప 2’ కలెక్షన్లలో శ్రీతేజ ఫ్యామిలీకి 10 శాతం ?
Pushpa 2: పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు రేవతి మరణించగా… ఆమె కొడుకు శ్రీ తేజ్… ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆ కుర్రాడిపై తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేవతి కొడుకు ఆరోగ్యం క్రిటికల్ గా ఉందని…అతని ఆదుకోవాల్సిన బాధ్యత అల్లు అర్జున్ దేనని… వెల్లడించారు తీన్మార్ మల్లన్న. పుష్ప 2 సినిమా కలెక్షన్లలో 10% రేవతి కుటుంబానికి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. Pushpa 2
10 percent of Pushpa 2 collections to Sriteja family
ఇదే విషయంపై రేపు శాసనమండలిలో మాట్లాడతానని తీన్మార్ మల్లన్న వెల్లడించారు. ఈ విషయంలో తాను తగ్గబోనని వివరించారు. ఇక అటు టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును తెలంగాణ పోలీసులు ఆశ్రయించారు. ఒకవేళ అక్కడ బెయిల్ రద్దు అయితే కచ్చితంగా అల్లుఅర్జున్ ను మళ్లీ అరెస్టు చేస్తారు అని న్యాయవాదులు చెబుతున్నారు. మరి ఈ విషయంపై… తెలంగాణ పోలీసులు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి. Pushpa 2
Also Read: Cm Revanth Reddy: రేవంత్ రెడ్డి భోజనం ఖర్చు 32 లక్షలు?
HYDలోని RTC క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా.. ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా ఆ బాలుడి ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. అతని ఆరోగ్యం విషమంగానే ఉందని.. వెంటి లేటర్ పై కృతిమ శ్వాస అందిస్తున్నామన్నారు. బాలుడికి జ్వరం తగ్గుతోందని, ఫీడ్ లను బాగా తట్టుకుంటున్నాడని తెలిపారు. Pushpa 2