Khushbu: నటిగా, నిర్మాతగా, టీవీ యాంకర్ గా, రాజకీయ నాయకురాలిగా అన్ని రంగాల్లో కూడా తనదైన శైలిలో దూసుకుపోతుంది కుష్బూ. బాల నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె 1988లో తమిళ్ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయింది. ఇక అనంతరం వరస మూవీ చేస్తూ మెప్పించిన ఈ బ్యూటీ మలయాళం లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది.
ఇక తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది ఈ భామ. ముఖ్యంగా చిరంజీవితో స్టాలిన్ చిత్రంలో అక్క పాత్రలో నటించి విమర్శకుల నుంచి ఈ ప్రశంసలను అందుకుంది. ఇక కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో 2000 సమయంలో దర్శకుడు సుదీర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఖుష్బూ. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన పెళ్లిలో జరిగిన ఓ ఆసక్తికర ఘటన గురించి ప్రేక్షకులతో పంచుకుంది.
” సుధీర్ నన్ను పెళ్లి చేసుకోబోతున్నట్లు మొదట హీరో కార్తీక్ తో చెప్పాడు. అప్పుడు నాకు కార్తీక్ కాల్ చేసి సంతోషంగా ఉందని చెప్పారు. అలాగే మా పెళ్ళి కి కూడా వచ్చాడు. అప్పుడు నేను సుదీర్ ఆయన కాళ్లపై పడి ఆశీర్వాదాలు తీసుకున్నాం. అప్పుడు కార్తీక్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు ” అంటూ చెప్పింది కుష్బూ. ప్రజెంట్ కుష్బూ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.