Samantha: సమంతకు ఫార్మ్ హౌస్ ఇచ్చి ఆ కోరిక తీర్చుకున్న నిర్మాత..?
Samantha: సమంత తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్ళు గడుస్తున్న తరగని అందంతో దూసుకుపోతున్న హీరోయిన్. అయితే అలాంటి ఈమె కెరియర్ మంచి పొజిషన్ లో ఉండగానే నాగచైతన్యతో లవ్ లో పడి చివరికి ఆయనను వివాహం చేసుకుంది. కానీ వీరి వివాహ బంధం అనేది మూడునాళ్ల ముచ్చటగానే మారిపోయింది. అలా సమంత నాగ చైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత తన కెరీర్ పై దృష్టి పెట్టింది. ఇదే తరుణంలో ఆమెకు అనేక అనారోగ్య సమస్యలు వచ్చాయి.
The producer who gave the farm house to Samantha
వాటిని కూడా అధిగమించి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ పాత్రలు, విలన్ రోల్స్ చేస్తూ తనకు ఎదురులేరనుపించుకుంటుంది. అలాంటి సమంత కు ఆ నిర్మాత ఫామ్ హౌస్ ఇచ్చి తన కోరిక తీర్చుకున్నారట. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. సమంత ఇండస్ట్రీలో మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, వంటి పెద్ద పెద్ద స్టార్లతో హీరోయిన్ గా చేసింది. (Samantha)
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ పై పగబట్టిన హీరోలు.. ఇంటికి పిలిపించుకొని మరీ అవమానించారా.?
అలాంటి ఈమె కొత్తగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో డెబ్యూ మూవీ అల్లుడు శీను సినిమా కూడా చేసింది. ఈ మూవీ టైంలో సమంతతో తనకు ఎదురైన అనుభవాలను నిర్మాత బెల్లంకొండ సురేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సమంత ఇండస్ట్రీలో అప్పటికే పెద్ద స్టార్ హీరోయిన్. ఈ టైంలో నా కొడుకు చేసే సినిమాలో ఆమె నటిస్తుందో లేదో అని అనుమానంతోనే వెళ్లి నేను అడిగాను. కానీ నా మాట మీద గౌరవంతో ఆమె సినిమా ఒప్పుకుంది.
ఆ షూటింగ్ చేస్తున్న సందర్భంలోనే సమంతకు కాస్త అనారోగ్య పరిస్థితులు వచ్చాయి. వెంటనే నేను 25 లక్షలు ఆమెకు అందించి వైద్యం చేయించుకోమని చెప్పాను. అయితే ఆ డబ్బులను ఆమె రెమ్యూనరేషన్ లో కట్ చేసుకుంది. అంతేకాకుండా సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. భారీగా లాభాలు కూడా వచ్చాయి. ఆ ఆనందంలో నేను సమంతాకి ఒక పెద్ద పామ్ హౌస్ గిఫ్టుగా అందించాలని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దాని విలువ మూడు కోట్ల పైగానే ఉంటుందని అన్నారు. ఈ విధంగా సమంతాకు అది గిఫ్ట్ గా ఇచ్చి నా కోరిక తీర్చుకున్నానని చెప్పుకొచ్చారు.(Samantha)